Aishwarya Dhanush: ధనుష్-ఐశ్వర్య డైవర్స్.. నో ఛాన్స్ కలిసేదే లేదు!

18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు ఐశ్వర్య, ధనుష్. నిజానికి ఐశ్వర్య, ధనుష్ ముందు ఫ్రెండ్స్..

Aishwarya Dhanush: ధనుష్-ఐశ్వర్య డైవర్స్.. నో ఛాన్స్ కలిసేదే లేదు!

Dhanush Aishwarya

Aishwarya Dhanush: 18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు ఐశ్వర్య, ధనుష్. నిజానికి ఐశ్వర్య, ధనుష్ ముందు ఫ్రెండ్స్, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా జీవితాంతం కలిసుండలేక పోయారు. ప్రస్తుతం ధనుష్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించడానకి గట్టిగా ప్రయత్నిస్తుంటే.. ఐశ్వర్య కూడా డైరెక్షర్ గా ఏకంగా బాలీవుడ్ లోనే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Aishwaryaa Rajinikanth : బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ధనుష్ మాజీ భార్య

ధనుష్-ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించిన అనంతరం వాళ్ళ అభిమానులు షాక్ లో ఉండిపోయారు. ధనుష్ తండ్రి వాళ్ళతో మేము మాట్లాడి చూస్తామని.. రజినీకాంత్ తో మాట్లాడి వాళ్ళు మళ్ళీ కలిసేలా చూస్తామని ప్రకటించడంతో ఏమో వాళ్ళు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందని అభిమానులు ఇన్నాళ్లు ఆశతో ఉన్నారు. ఈ మధ్యనే ఐశ్వర్య ఆల్బమ్ సాంగ్ కు ధనుష్ శుభాకాంక్షలు చెప్పడం.. ఐశ్యర్య సోషల్ మీడియాలో ధనుష్ పేరును కొనసాగించడంతో వీళ్ళు మళ్ళీ కలుస్తారేమో అని చర్చలు కూడా సాగాయి.

Aishwarya R. Dhanush: ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. ఓ అర్ధం కాని పజిల్!

కానీ.. నో ఛాన్స్ ఇక కలిసేదే లేదు అనేలా తాజాగా ఐశ్వర్య చెప్పకనే చెప్పేసింది. నిన్నటి వరకు ఐశ్వర్య ఆర్ ధనుష్ గా ఉన్న తన సోషల్ మీడియా పేరును ఐశ్వర్య రజినీకాంత్ గా మార్చేసుకుంది. అంతేకాదు ఐ యామ్ వాట్ ఐ యామ్ అంటూ ధనుష్ మళ్ళీ కలిసేది లేదని ఇక చెప్పకనే చెప్పేసింది. ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. ఐశ్యర్య ఇప్పటి వరకు ధనుష్ పేరు అలాగే ఉంచింది. ఇక, ఇప్పుడు ధనుష్ గుర్తు లేకుండా పేరును కూడా తొలగించేసి ఇక కలిసేది లేదని చెప్పేసింది.