భారత్ : ‘అత్తే ఆ’ వీడియో సాంగ్ రిలీజ్..

భారత్ : ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమాలోనుండి 'అత్తే ఆ' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు..

  • Published By: sekhar ,Published On : May 9, 2019 / 10:42 AM IST
భారత్ : ‘అత్తే ఆ’ వీడియో సాంగ్ రిలీజ్..

భారత్ : ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమాలోనుండి ‘అత్తే ఆ’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు..

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్‌లో..గుల్షన్ కుమార్ అండ్ టి-సిరీస్ సమర్పణలో, సల్మాన్ ఖాన్ ఫిలింస్ అండ్ రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి.ఫిలిం బ్యానర్‌పై, అతుల్ అగ్నిహోత్రి, అల్విర ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ అండ్ కృష్ణ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, భారత్.. జర్నీ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఏ నేషన్ టు గెదర్ అనేది ట్యాగ్ లైన్.. ఈ సినిమాలో సల్మాన్ పలు డిఫరెంట్ గెటప్స్‌లో, విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమాలోనుండి  ‘అత్తే ఆ’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు.

సల్మాన్, కత్రినా కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమొంట్స్ ఈ పాటకి హైలెట్ అయ్యాయి. కత్రినా చీరకట్టుతో అలరించగా, సల్మాన్ ఎప్పటిలానే తన స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. విశాల్-శేఖర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి ఇర్షాద్ కమీల్ లిరిక్స్ రాయగా, వైభవీ మర్చంట్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దిశా పటానీ మరో హీరోయిన్‌‌ కాగా, టబు, జాకీ ష్రాఫ్, సోనాలీ కులకర్ణి, సునీల్ గ్రోవర్, నోరా ఫతేహి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సుల్తాన్, టైగర్ జిందాహై సినిమాల తర్వాత అలీ అబ్బాస్, సల్మాన్‌ల కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. భారత్ రంజాన్ కానుకగా జూన్ 5 న రిలీజ్ కానుంది..  

వాచ్ వీడియో సాంగ్..