Ajay Devgn : మళ్ళీ వస్తున్న సింగం.. అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి సింగం ఎగైన్..

అజయ్ దేవ్‌గణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది ‘సింగం’ సినిమా. రెండు సినిమాల ఈ కాప్ సిరీస్ ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ లో అజయ్ దేవ్‌గణ్, డైరెక్టర్ రోహిత్ శెట్టిది సూపర్ కాంబో. ఇద్దరి కాంబినేషన్‌లో.............

Ajay Devgn : మళ్ళీ వస్తున్న సింగం.. అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి సింగం ఎగైన్..

Ajay Devgn and rohit shetty combo coming with Singam again movie

Ajay Devgn :  అజయ్ దేవ్‌గణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది ‘సింగం’ సినిమా. రెండు సినిమాల ఈ కాప్ సిరీస్ ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ లో అజయ్ దేవ్‌గణ్, డైరెక్టర్ రోహిత్ శెట్టిది సూపర్ కాంబో. ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ మొత్తం 10 సినిమాలొచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలవడంతో ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. జమీన్, గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్ సినిమాలతో అజయ్ దేవ్‌గణ్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్సిచ్చాడు రోహిత్. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ ‘సింగం ఎగైన్’అంటూ యాక్షన్ మసాలాతో రాబోతున్నారు. సింగం, సింగం రిటర్న్స్ తర్వాత అజయ్ దేవ్‌గణ్ చేయబోతున్న మరో పవర్ ఫుల్ కాప్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది.

జూలై నుంచి సింగం రిటర్న్స్ రెగ్యులర్ షూటింగ్ బిగిన్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ మొదలు పెట్టారు. 2024 దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గతేడాది చివర్లో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సర్కస్’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సారి తనకు అచ్చొచ్చిన హీరోతో అచ్చొచ్చిన సింగం సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రోహిత్ శెట్టి.

Ram Charan : నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా ఈ చిన్న టెంపుల్ ని తీసుకెళతాం.. అమెరికాలో చరణ్, ఉపాసన పూజలు..

బాలీవుడ్ స్టార్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తన హీరో అజయ్ దేవ్‌గణ్ తో ‘సింగం ఎగైన్’ సినిమాతో 11వ బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ అజయ్ కి వినిపించినట్టు, అజయ్ కూడా ఓకే చేసినట్టు సమాచారం. తమిళ ‘సింగం’ రీమేక్ గా వచ్చిన హిందీ ‘సింగం’ మూవీ సూపర్ హిట్టవడంతో ఆ తర్వాత తమిళ సిరీస్ తో సంబంధం లేకుండా వేరే కథతో సింగం రిటర్న్స్ తీశారు. అది కూడా మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు సింగం ఎగైన్ గా రాబోతున్నారు. దీంతో అజయ్ దేవ్‌గణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అజయ్ ఇటీవల దృశ్యం 2 రీమేక్ తో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు మార్చ్ 30న ఖైదీ రీమేక్ భోళా సినిమాతో వచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సింగం ఎగైన్ సినిమా 2024 దీపావళికి రానున్నట్టు సమాచారం.