Ajay Devgn-Tabu : బాలీవుడ్ సినిమాని ఏలుతున్న రియల్ ఫ్రెండ్స్..

ఈ మధ్య అజయ్ దేవ్ గణ్ డిఫరెంట్ డిఫరెంట్ జానరస్ లో సినిమాలు చేస్తున్నారు. ఏ జానర్ మూవీ చేసినా అందులో ఒకటి మాత్రం కామన్ గా కనిపిస్తోంది. అదే తన క్లోజ్ ఫ్రెండ్ టబు. అజయ్ ప్రతి సినిమాలో టబు స్పెషల్ ఎట్రాక్షన్ గా.................

Ajay Devgn-Tabu : బాలీవుడ్ సినిమాని ఏలుతున్న రియల్ ఫ్రెండ్స్..

Ajay Devgn and Tabu continue their friendship in on screen and off screen still so many years

Ajay Devgn-Tabu :  ఈ మధ్య అజయ్ దేవ్ గణ్ డిఫరెంట్ డిఫరెంట్ జానరస్ లో సినిమాలు చేస్తున్నారు. ఏ జానర్ మూవీ చేసినా అందులో ఒకటి మాత్రం కామన్ గా కనిపిస్తోంది. అదే తన క్లోజ్ ఫ్రెండ్ టబు. అజయ్ ప్రతి సినిమాలో టబు స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తోంది. దాదాపు చిన్నప్పటి నుంచి రియల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వీళ్ళు రీల్ పై ఈ మధ్య ప్రతి సినిమాలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్, టబు కాలేజీ నుండే క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్ షిప్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. ఈ మధ్య కాలంలో అజయ్ దేవ్ గణ్ ప్రతి సినిమాలోటబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్లో 9 సినిమాలు రాగా లేటెస్ట్ గా 10వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.

విశాల్ భరద్వాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ ఖూఫియాలో అజయ్, టబు లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఖూఫియా స్టార్ట్ చెయ్యకముందే భోలా సినిమాని కంప్లీట్ చేశారు ఈ ఇద్దరూ. సౌత్ లో వచ్చిన ఖైతీ రీమేక్ గా వస్తున్న భోలాలో అజయ్ దేవ్ గణ్ తో పాటు స్ట్రాంగ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తోంది టబు. ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ బెస్ట్ ఫ్రెండ్స్. అజయ్ దేవ్ లీడ్ రోల్ లో టబు పోలీస్ ఆఫీసర్ గా చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ దృశ్యం 2. మలయాళ దృశ్యం 2కి రీమేక్ గా వచ్చిన బాలీవుడ్ దృశ్యం 2లో కూడా ఈ ఇద్దరి మ్యాజిక్ రిపీట్ అయ్యింది. పోటా పోటీగా నటించిన అజయ్ దేవ్ గణ్, టబు సినిమాని హిట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారు.

2019 లో వచ్చిన క్రేజీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ దేదే ప్యార్ దే లో కూడా అజయ్, టబు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో మంచి రొమాంటిక్ కపుల్ గా నటించారు అజయ్, టబు. లవ్ రాంజన్ డైరెక్షన్లో వచ్చిన దేదే ప్యార్ దే అజయ్, టబు కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ తో మంచి సక్సెస్ అందుకుంది. అంతకుముందు 2017 లో వచ్చిన రోహిత్ శెట్టి సూపర్ న్యాచురల్ కామెడీ సిరీస్ గోల్ మాల్ ఎగేన్ మూవీలో కూడా అజయ్, టబు హిలేరియస్ గా నవ్వించారు.

ఏదో ఫ్రెండ్స్ కదా కలిసి సినిమాలు చేశామంటే చేశామనే లెక్క కాకుండా చేసిన ప్రతి సినిమా ఆడియన్స్ కి మెమరబుల్ హిట్ అందించారు. కంటెంట్ వైజ్ గానే కాదు, కమర్షియల్ గా సూపర్ హిట్లు కూడా ఇచ్చారు అజయ్, టబు. 1995 లో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశారు అజయ్, టబు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన హకీకత్ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సల్మాన్ , షారూఖ్ లాంటి హీరోలు సత్తాచాటుతున్న టైమ్ లో టబు, అజయ్ జంటగా వచ్చిన హకీకత్ వన్ ఆఫ్ ద హయ్యస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ గా 1995 లో సూపర్ హిట్ అయ్యింది.

అజయ్ దేవ్ గణ్, టబు మ్యాజిక్ రిపీట్ అయిన మరో సినిమా తక్ షక్. తక్ షక్ మూవీ మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ యాక్షన్ డ్రామా మూవీ లో అజయ్, టబు మరోసారి తమ ఇంటెన్స్ రిలేషన్ ని ఆన్ స్క్రీన్ కూడా పండించి సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ కొట్టేశారు. కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్, టబు లీడ్ రోల్స్ లో వచ్చిన ఫితూర్ లో టబు సెటిల్డ్ పర్ ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ టబుతో ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ కాకుండా కామియోతో అదరగొట్టారు.

Heroins : యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్లు..

ఇక వీళ్లిద్దరూ కలిసి చేసి బ్లాక్ బస్టర్ అయిన మరో సినిమా విజయ్ పథ్. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి మ్యూజికల్ గా కమర్షియల్ గా అజయ్ దేవ్ గణ్, టబు కెరీర్ కి సూపర్ హిట్ అందించింది, ఇలా అటు అజయ్ దేవ్ గణ్, ఇటు టబు ఇద్దరూ దాదాపు 25 ఏళ్ల నుంచి తమ ఫ్రెండ్ షిప్ ని ఆఫ్ స్క్రీన్ తో పాటు ఆన్ స్క్రీన్ కూడా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వీరిద్దరూ తమ ఫ్రెండ్షిప్ గురించి బహిరంగంగానే చాలా సార్లు చెప్పారు.