Ajay Devgn : ఖైదీ రీమేక్‌తో భోళా యూనివర్స్ క్రియేట్ చేస్తానంటున్న అజయ్ దేవగన్..

అజయ్ దేవగన్ (Ajay Devgn) భోళా (Bholaa) అనే టైటిల్ తో సౌత్ సూపర్ హిట్ మూవీ 'ఖైదీ'ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాను అంటున్నాడు అజయ్ దేవగన్.

Ajay Devgn : ఖైదీ రీమేక్‌తో భోళా యూనివర్స్ క్రియేట్ చేస్తానంటున్న అజయ్ దేవగన్..

Ajay Devgn wants to create Bholaa universe

Ajay Devgn : ఈమధ్య కాలంలో మూవీ మేకర్స్ అంతా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన ‘విక్రమ్’ (Vikram) సినిమాతో మొదలైందా? లేదా మరో సినిమాతో మొదలైందా? అనేది తెలియదు గాని ప్రస్తుతం ఇండియాలోని ప్రతి మేకర్ తన యూనివర్స్ ని క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే లోకేష్, ప్రశాంత్ నీల్, శైలేష్ కొలను, రోహిత్ శెట్టి వంటి వారు తమకంటూ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశారు.

Taapsee Pannu : తాప్సీ పై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు..

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) కూడా తన యూనివర్స్ ని తీసుకు వస్తా అంటున్నాడు. ఈ హీరో నటుడు గానే కాదు దర్శకుడిగా కూడా ఆడియన్స్ ని అలరిస్తుంటాడు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో సౌత్ సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’ని రీమేక్ చేస్తున్నాడు. భోళా (Bholaa) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేశారు. మార్చి 30న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అజయ్ మాట్లాడుతూ.. నాకు భోళా యూనివర్స్ క్రియేట్ చేయాలనీ ఉంది. ఇందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Vishwak Sen : సూపర్ హిట్టు కాంబినేషన్‌తో వస్తున్న విశ్వక్.. తనలోని బ్యాడ్‌ని పరిచయం చేస్తాడట!

అయితే ఖైదీ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోని ఒక పార్ట్. ఆ మూవీని తీసుకోని అజయ్ దేవగన్.. మరో యూనివర్స్ క్రియేట్ చేస్తాను అనడంతో సౌత్ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే, ఈ హీరో నటించిన మరో చిత్రం ‘మైదాన్’ (Maidaan). బయోపిక్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రం రెండేళ్ల క్రిందటే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వాళ్ళ పోస్ట్‌పోన్ అవ్వడం, ఆ తరువాత విడుదల చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురుకుంది. ఇక ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.