‘మైదాన్’ రిలీజ్ డేట్ మారింది..

అజయ్‌దేవ్‌గన్ ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్న ‘మైదాన్’ విడుదల వాయిదా..

  • Published By: sekhar ,Published On : February 3, 2020 / 08:31 AM IST
‘మైదాన్’ రిలీజ్ డేట్ మారింది..

అజయ్‌దేవ్‌గన్ ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్న ‘మైదాన్’ విడుదల వాయిదా..

ఇటీవలే తన 100వ సినిమా ‘తానాజీ’ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ కథానాయకుడు.. అజయ్‌దేవ్‌గన్.. ఆయన మల్టీస్టారర్‌ చిత్రాల్లోనే కాదు, అన్ని రకాల ప్రాంతీయ భాషల్లోనూ నటిస్తున్నారు. అజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మైదాన్‌’..

AJAY

 

హైదరాబాద్‌కి చెందిన ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియో, బోనీకపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియమణి కథానాయిక.. ఇటీవల విడుదల చేసిన ‘మైదాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

Read Also : హీరోలెవరూ ఖాళీ లేరు – షూటింగ్స్‌తో కళకళలాడుతున్న తెలుగు పరిశ్రమ

MAIDAN

తాజాగా న్యూ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ముందుగా 2020 నవంబర్ 27న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్‌కి షిఫ్ట్ అయ్యారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 డిసెంబర్ 11న ‘మైదాన్’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్ మరియు మళయాల భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.