Ajith Kumar : తమిళ స్టార్ హీరో తండ్రి మృతి.. తీవ్ర విషాదంలో అభిమానులు..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకుంది. ఆయన తండ్రి పిఎస్ మణి 84 ఏళ్ళ వయసులో నేడు (మార్చి 24) కన్నుమూశారు.

Ajith Kumar father PS Mani passed away
Ajith Kumar : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) రీసెంట్ గా తూనీవు (Thunivu) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తెలుగులో ‘తెగింపు’ పేరుతో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. యాక్షన్ హీస్ట్ మూవీగా వచ్చిన ఆ చిత్రం దాదాపు 250 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత అజిత్ కొంచెం బ్రేక్ తీసుకొని వెకేషన్ కి వెళ్ళాడు. ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన అజిత్ అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య షాలిని అక్కడి ఫోటోలను అన్ని షేర్ చేస్తూ అజిత్ ఫ్యాన్స్ ని సంతోష్ పరుస్తుంది. అయితే ఇంతలో అజిత్ ఇంట ఒక విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది.
Ajith Kumar: 7 ఖండాల్ని బైక్ పై చుట్టేబోతున్న హీరో అజిత్.. నిజమేనా?
అజిత్ కుమార్ తండ్రి పిఎస్ మణి 84 ఏళ్ళ వయసులో నేడు (మార్చి 24) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన ఆక్టోజెనేరియన్ అనేక ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ వస్తున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈరోజే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆయనకు అంత్యక్రియలు చేయనున్నారు. పీఎస్ మణి కేరళలోని పాలక్కాడ్‌కు చెందినవారు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారి రెండో అతను అజిత్ కుమార్.
Ajith Kumar: 22 ఏళ్ల తరువాత అజిత్‌తో స్టార్ హీరోయిన్ రొమాన్స్..?
ఇక ఈ మరణవార్త తెలుసుకున్న సినిమా ప్రముఖులు, అభిమానులు.. అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా అజిత్ కుమార్ అండ్ బ్రదర్స్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మా నాన్నగారు ఈరోజు ఉదయం నిద్రలోనే కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా వైద్యులు ఆయన ట్రీట్మెంట్ లో చాలా సహాయం చేశారు. వారందరికీ మా కృతజ్ఞతలు. సంతాపం తెలియజేయాలనుకున్న ప్రతిఒక్కరికి మేము రెస్పాండ్ కాలేకపోతున్నాము, క్షమించండి. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, కాబట్టి ఈ అంతిమయాత్రని ప్రైవేట్ గా సాగనివ్వండి అంటూ విన్నవించుకున్నారు.
Stay strong #AjithKumar Anna pic.twitter.com/UK3bHurpB1
— ᴠɪꜱʜɴᴜ_ᴋ (@vishnu_k2000) March 24, 2023