Ajith Kumar : బైక్ పై స్టార్ హీరో అజిత్ వరల్డ్ టూర్.. మీరు కూడా వెల్దామనుకుంటున్నారా?

బైక్, కార్ రేసర్ అయిన స్టార్ హీరో అజిత్ ఫిఫ్టీస్ లో కూడా వేల కిలోమీటర్లు రైడింగ్ కి వెళ్లొస్తూ ఉంటారు. ఇలా తనలా అడ్వెంచర్స్ ఎక్స్ ప్లోర్ చెయ్యడం అంటే ఇంట్రస్ట్ ఉన్న రైడర్స్ కోసం అజిత్ కుమార్ మోటార్ రైడ్ అనే సంస్థ వెల్కమ్ చేస్తుందంటున్నారు.

Ajith Kumar : బైక్ పై స్టార్ హీరో అజిత్ వరల్డ్ టూర్.. మీరు కూడా వెల్దామనుకుంటున్నారా?

Ajith Kumar starts AK Moto Ride for helping to Bike Riders

AK Moto Ride : స్టార్ హీరోలందరూ ఎన్ని సినిమాలు చేసి, సక్సెస్ లుకొట్టి, లైమ్ లైట్లో ఉండాలనుకుంటుంటే తమిళ్(Tamil) స్టార్ హీరో అజిత్(Ajith) మాత్రం సినిమాలకి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వకుండా తన ప్యాషన్ అయిన బైక్ రైడింగ్(Bike Riding) ఫీల్డ్ లోనే కొత్త అడ్వెంచర్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకూ వేల కిలో మీటర్లు బైక్ మీద డ్రైవ్ చేసిన అజిత్ తనలా ఇంట్రస్ట్ ఉన్న రైడర్స్ కి AK మోటో రైడ్(AK Moto Ride) హెల్ప్ చేస్తుందంటూ అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు.

బైక్, కార్ రేసర్ అయిన స్టార్ హీరో అజిత్ ఫిఫ్టీస్ లో కూడా వేల కిలోమీటర్లు రైడింగ్ కి వెళ్లొస్తూ ఉంటారు. ఇలా తనలా అడ్వెంచర్స్ ఎక్స్ ప్లోర్ చెయ్యడం అంటే ఇంట్రస్ట్ ఉన్న రైడర్స్ కోసం అజిత్ కుమార్ మోటార్ రైడ్ అనే సంస్థ వెల్కమ్ చేస్తుందంటున్నారు. ఇంట్రస్ట్ ఉన్న వాళ్లకి ట్రెయినింగ్, రైడింగ్ బైక్స్, రూట్ మ్యాప్స్ తో పాటు హై సేఫ్టీస్కిల్స్ ఉన్న ట్రైనర్స్ తో ట్రెయినింగ్ ప్రొవైడ్ చేస్తుందని సోషల్ మీడియాలో తెలిపారు అజిత్ టీం. ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా తమ సంస్థ పనిచేస్తుందంటున్నారు అజిత్.

Dimple Hayathi : పోలీస్ కేసు నమోదుపై సెటైరికల్ గా స్పందించిన డింపుల్ హయతి.. ట్వీట్స్ వైరల్..

అజిత్ దగ్గర ఇప్పటికే 25 లక్షలు విలువ చేసే BMW బైక్, 20 లక్షలు విలువ చేసే యాప్రిలియో బైక్, 21 లక్షలు విలువ చేసే BMW 1300, యమహా బైక్.. ఇలా చాలా అల్ట్రా స్టైలిష్ బైక్స్ ఉన్నాయి. అజిత్ కి సినిమాలు జస్ట్ ప్రొఫెషన్ మాత్రమే. తన ప్యాషన్ అంతా బైక్స్, కార్ రైడింగ్, షూటింగ్ అని ఎప్పుడో చెప్పారు అజిత్. అందుకే చేసినంత కాలం షూటింగ్, షూట్ లేకపోతే బైక్ తీసుకుని నెలలతరబడి ట్రిప్ కి వెళ్లిపోతారు. అడ్వాన్స్ డ్ బైక్స్ తో ఇప్పటికే నేపాల్, భూటాన్ లాంటి దేశాల్ని బైక్ మీద చుట్టొచ్చిన అజిత్ త్వరలోనే వరల్డ్ టూర్ కి వెళుతున్నట్టు అజిత్ మేనేజర్ కన్ఫామ్ చేశారు. 18 నెలల పాటు 62 దేశాలు తిరిగిరావడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు అజిత్. అజిత్ తో పాటు మరికొంతమందిని తీసుకెళ్లడానికి, అలాగే బైక్ రైడింగ్ ఇష్టమున్న వాళ్లకు సపోర్ట్ చేయడానికి అజిత్ AK మోటో రైడ్ మొదలుపెడుతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలపనున్నారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ మరోసారి అజిత్ ని పొగిడేస్తున్నారు.