Thegimpu: తెగింపు క్లైమాక్స్‌పై అదిరిపోయే బజ్.. ఆడియెన్స్ సస్పెన్స్‌ను తట్టుకోగలరా..?

తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తునివు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం రెట్టింపు చేసింది.

Thegimpu: తెగింపు క్లైమాక్స్‌పై అదిరిపోయే బజ్.. ఆడియెన్స్ సస్పెన్స్‌ను తట్టుకోగలరా..?

Ajith Thegimpu Movie To Have A Solid Climax

Thegimpu: తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తునివు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం రెట్టింపు చేసింది.

Ajith: తునివు ట్రైలర్.. యాక్షన్‌తో ఇరగ్గొట్టిన అజిత్.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయం!

ఈ మూవీలోని మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు అజిత్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాను తెలుగులో ‘తెగింపు’ అనే పేరుతో రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ తెగింపు మూవీకి సంబంధించి క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. తెగింపు మూవీలోని క్లైమాక్స్ ఆడియెన్స్‌ను సీట్లకు అతుక్కుపోయేలా డిజైన్ చేసిందట చిత్ర యూనిట్. ముఖ్యంగా ఈ సినిమా మొత్తంలోనూ మనకు హీరో అజిత పేరును ఎక్కడా రివీల్ చేయకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతుందని.. క్లైమాక్స్‌లో మాత్రమే హీరో పేరును రివీల్ చేసి ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Ajith: కన్ఫం.. ‘తెగింపు’తో దిగుతున్న తమిళ స్టార్ హీరో!

మరి నిజంగానే ఇలాంటి క్లైమాక్స్ ఉంటే ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడం ఖాయమని.. అయితే హీరో పేరును చెప్పుకుండానే రెండున్నర గంటలపాటు ఆడియెన్స్‌ను సినిమాలో లీనమయ్యేలా అట్రాక్ట్ చేయగలరా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దింది చిత్ర యూనిట్. మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.