Ajith: అజిత్ ‘తునివు’ కలెక్షన్స్‌తో అదరగొడుతోందిగా.. ఆల్‌టైమ్ గ్రాసర్‌గా మారనుందా..?

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తునివు’ పొంగల్ కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేయగా, ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఇక ఈ సినిమాకు తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Ajith: అజిత్ ‘తునివు’ కలెక్షన్స్‌తో అదరగొడుతోందిగా.. ఆల్‌టైమ్ గ్రాసర్‌గా మారనుందా..?

Ajith Thunivu Collections Sets New Mark

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తునివు’ పొంగల్ కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేయగా, ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఇక ఈ సినిమాకు తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Ajith: ఓటీటీలో అజిత్ తెగింపు చూపెట్టేది ఆరోజేనా..?

కాగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కళ్లు చెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి. తమిళంలో తునివుతో పాటు విజయ్ నటించిన వారిసు చిత్రం కూడా పొంగల్ బరిలో రిలీజ్ కాగా, ఈ రెండు సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇద్దరు హీరోల సినిమాలకు అనుకున్న స్థాయిలో వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే తునివు చిత్రానికి తెలుగులోకంటే కూడా తమిళంలోనే మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.225 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసినట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి.

Ajith: ‘వారసుడు’ని నెట్టుకుంటూ వస్తున్న అజిత్.. అర్ధరాత్రికే తెగింపు చూడనున్న ఫ్యాన్స్!

ఇది అజిత్ కెరీర్‌లో మంచి ఫిగర్స్‌ను నమోదు చేసిందని.. మున్ముందు ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించగా, మంజు వారియర్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్‌లో కనిపించింది. ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ కపూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.