Ajith Thunivu : అజిత్ ‘తెగింపు’ ఓటిటిలోకి వచ్చేస్తుంది..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'తునివు'. తెలుగులో 'తెగింపు' టైటిల్ తో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా వచ్చిన యాక్షన్ హీస్ట్ చిత్రం యాక్షన్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటిటికి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది.

Ajith Thunivu : అజిత్ ‘తెగింపు’ ఓటిటిలోకి వచ్చేస్తుంది..

ajith Thunivu ott

Ajith Thunivu : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’ టైటిల్ తో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించాడు. తమిళ స్టార్ డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. మలయాళ బ్యూటీ మంజు వారియర్ అజిత్ సరసన నటించింది. సముద్రఖని, అజయ్, జాన్ కొక్కెన్ ప్రధాన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు. యాక్షన్ హీస్ట్ కథాంశం వచ్చిన ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా సుమారు రూ.250 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

Ajith: అజిత్ ‘తునివు’ కలెక్షన్స్‌తో అదరగొడుతోందిగా.. ఆల్‌టైమ్ గ్రాసర్‌గా మారనుందా..?

ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటిటికి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ ప్రసారం కానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ.. ఓటిటిలో కూడా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజున విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

కాగా అజిత్ తన తదుపరి సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తన కెరీర్ లో 62వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆగిపోయింది అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని లైకా సంస్థ నిర్మిస్తుంది. కథ విషయంలో నిర్మాతలు సంతృప్తి చెందకపోవడంతో దర్శకుడు విగ్నేష్ ని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలిగించినట్లు తెలుస్తుంది. విగ్నేష్ శివన్ కూడా తన సోషల్ మీడియా నుంచి AK62 పోస్ట్ లను తొలిగించాడు. అయితే దీని పై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అజిత్ ఫ్యామిలీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.