Ajith: ‘వారసుడు’ని నెట్టుకుంటూ వస్తున్న అజిత్.. అర్ధరాత్రికే తెగింపు చూడనున్న ఫ్యాన్స్!

తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ పొంగల్ భలే రంజుగా మారింది. ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అనే రీతిలో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. తమిళ ఇళయథళపతి విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుతో ‘వారిసు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయడంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Ajith: ‘వారసుడు’ని నెట్టుకుంటూ వస్తున్న అజిత్.. అర్ధరాత్రికే తెగింపు చూడనున్న ఫ్యాన్స్!

Ajith Thunivu To Be Premiered Before Vijay Varisu

Ajith: తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ పొంగల్ భలే రంజుగా మారింది. ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అనే రీతిలో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. తమిళ ఇళయథళపతి విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుతో ‘వారిసు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయడంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Ajith: అజిత్‌తో వైరానికి దిగుతున్న వర్సెటైల్ యాక్టర్.. ఎవరంటే?

ఇక ఈ పండగ బరిలో హీరో అజిత్ కుమార్ మరోసారి తనకు ఎంతగానో కలిసొచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌తో మనముందుకు రాబోతున్నాడు. దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తునివు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో. ఈ సినిమా ట్రైలర్ అభిమానుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అజిత్ చేసిన యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా పొంగల్ కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

Ajith: తెగింపు చూపిస్తోన్న అజిత్.. బరిలో ముందుగా దిగుతున్నాడుగా!

అయితే వారిసు చిత్రానికంటే ముందే తెగింపు చూపెడుతున్నాడు హీరో అజిత్. కోలీవుడ్ వర్గాల ప్రకారం వారిసు చిత్రానికి జనవరి 11న తెల్లవారుజామున 4 గంటలు ప్రీమియర్ షోలు పడనుండగా, అజిత్ తునివు చిత్రానికి మాత్రం అర్ధరాత్రి 1 గంటకే ప్రీమియర్స్ పడబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిసు చిత్రాన్ని వెనక్కి నెట్టుకుంటూ వచ్చి మరీ ప్రీమియర్స్‌తో తెగింపు చూపించబోతున్నాడు అజిత్. ఇక తునివు చిత్రాన్ని తెలుగులో ‘తెగింపు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తుండగా, విజయ్ వారిసు చిత్రాన్ని ‘వారసుడు’గా తీసుకురాబోతుంది చిత్ర యూనిట్. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.