Ajith: కన్ఫం.. ‘తెగింపు’తో దిగుతున్న తమిళ స్టార్ హీరో!

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తునివు’ తమిళంలో ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అజిత్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో మరో స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’కు పోటీగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Ajith: కన్ఫం.. ‘తెగింపు’తో దిగుతున్న తమిళ స్టార్ హీరో!

Ajith Thunivu To Release As Thegimpu In Telugu

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తునివు’ తమిళంలో ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అజిత్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో మరో స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’కు పోటీగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Vijay -Ajith : 9 ఏళ్ల తర్వాత.. బాక్సాఫీస్ వార్​కు రెడీఅయిన తమిళ స్టార్స్

అయితే అజిత్ సినిమాలకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. దీంతో ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు గతకొద్ది రోజులుగా ఎదురుచూస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తెలుగు పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘తెగింపు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రానుంది. ఇక ఈ సినిమాలో మంజూ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Ajith Kumar: 7 ఖండాల్ని బైక్ పై చుట్టేబోతున్న హీరో అజిత్.. నిజమేనా?

భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను తెలుగులో రాధాకఋష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, IVY ప్రొడక్షన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. మరి ‘తెగింపు’ మూవీకి తెలుగునాట ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.