Ajith: తునివు ట్రైలర్.. యాక్షన్‌తో ఇరగ్గొట్టిన అజిత్.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయం!

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తునివు’ ఇప్పటికే తమిళనాట ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా హిట్ అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే ఈ ట్రైలర్‌లో యాక్షన్‌తో విధ్వంసం సృష్టించాడు అజిత్.

Ajith: తునివు ట్రైలర్.. యాక్షన్‌తో ఇరగ్గొట్టిన అజిత్.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయం!

Ajith Thunivu Trailer Filled With Huge Action

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తునివు’ ఇప్పటికే తమిళనాట ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా హిట్ అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే ఈ ట్రైలర్‌లో యాక్షన్‌తో విధ్వంసం సృష్టించాడు అజిత్.

Ajith: ‘తెగింపు’ చూపిస్తున్న అజిత్.. ట్రైలర్‌తో ల్యాండ్ అవుతున్నాడుగా!

ఓ బ్యాంక్‌లో దోపీడి చేసే వ్యక్తిగా అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. దర్శకుడు వినోద్ మరోసారి తనదైన యాక్షన్ డోస్‌ను ఈ సినిమాతో ప్రేక్షకులకు చూపించాడు. ఇక అజిత్‌తో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మంజు వారియర్ కూడా ఈ మూవీలో యాక్షన్ చేస్తూ, డేరింగ్ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. అయితే అజిత్ ఈ సినిమాలో బ్యాంకును ఎందుకు లూటీ చేస్తున్నాడనేది సినిమా కథను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Ajith: కన్ఫం.. ‘తెగింపు’తో దిగుతున్న తమిళ స్టార్ హీరో!

ఇక ఈ సినిమాలో సముధ్రకని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ నటుడు అజయ్ కూడా పోలీస్‌గా కనిపిస్తున్నాడు. తునివు ట్రైలర్ మొత్తంలో అజిత్ చేసిన యాక్షన్, ఆయన స్టైల్, డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూవర్‌షిప్ వస్తుండటంతో అజిత్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘తెగింపు’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.