Ajith: ‘తెగింపు’ చూపిస్తున్న అజిత్.. ట్రైలర్‌తో ల్యాండ్ అవుతున్నాడుగా!

తమిళ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తునివు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అజిత్ ఫ్యాన్స్‌తో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో, ఈ సినిమాతో వీరిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Ajith: ‘తెగింపు’ చూపిస్తున్న అజిత్.. ట్రైలర్‌తో ల్యాండ్ అవుతున్నాడుగా!

Ajith To Show His Power With Thunivu Trailer

Ajith: తమిళ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తునివు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అజిత్ ఫ్యాన్స్‌తో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో, ఈ సినిమాతో వీరిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Ajith: కన్ఫం.. ‘తెగింపు’తో దిగుతున్న తమిళ స్టార్ హీరో!

ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తునివు చిత్ర ట్రైలర్‌ను ఇవాళ రాత్రి 7.30 గంటలకు తమిళనాడులోని పలు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుండగా, అజిత్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Vijay -Ajith : 9 ఏళ్ల తర్వాత.. బాక్సాఫీస్ వార్​కు రెడీఅయిన తమిళ స్టార్స్

కాగా, ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సముథ్రకని మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, తెలుగులో ఈ సినిమాను ‘తెగింపు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. మరో స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాతో పోటీకి దిగుతున్న అజిత్ ‘తునివు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.