Chor Bazar : ఆకాష్ పూరి ‘చోర్ బజార్’ కథ ఇదేనా??

ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ''నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ సినిమా ఇదే. నా ఫస్ట్ కమర్షియల్‌, హీరోయిజం సినిమా. ఇందులో బచ్చన్‌ సాబ్‌ అనే పాత్రలో కనిపిస్తాను. చోర్‌ బజార్‌ ఏరియా............

Chor Bazar : ఆకాష్ పూరి ‘చోర్ బజార్’ కథ ఇదేనా??

Chor Bazar

Chor Bazar :  పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా, గెహన సిప్పి హీరోయిన్ గా జార్జి రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చోర్ బజార్. ఇందులో సీనియర్ నటి అర్చన ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా జూన్ 24న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ పూరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కథ గురించి కూడా హింట్ ఇచ్చేశాడు. దీంతో చోర్ బజార్ కథ ఇదేనా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Movie Shootings : వివాదం ముగిసినట్టేనా? ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ ప్రెస్ మీట్.. ‌

ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ”నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ సినిమా ఇదే. నా ఫస్ట్ కమర్షియల్‌, హీరోయిజం సినిమా. ఇందులో బచ్చన్‌ సాబ్‌ అనే పాత్రలో కనిపిస్తాను. చోర్‌ బజార్‌ ఏరియా అనగానే మనం అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తుంటారనుకుంటాం. కానీ, దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ సినిమాలో నేనొక టైర్ల దొంగగా కనిపిస్తా. కారు కనిపిస్తే చాలు నిమిషాల్లో టైర్లు మాయం చేస్తుంటాను. ఈ చోరకళలో రికార్డులు సాధించేస్తుంటా. అయితే ఆ డబ్బులతో చోర్‌ బజార్‌లోని పేదవారికి సాయం చేస్తుంటాను. అందుకే అక్కడి వాళ్లకు నేను హీరో. ఇందులో హీరోయిన్ మూగ అమ్మాయి. అలాగే ఓ వజ్రం పోవడంతో అది చోర్ బజార్ లోనే ఉందని దాని కోసం వెతుకులాట మొదలవుతుంది. క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది” అని తెలిపారు.