Akashay Kumar : ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇదైనా అక్షయ్ కి హిట్ ఇస్తుందా?
సూర్య హీరోగా వచ్చిన తమిళ్ సూరారై పొట్రు, తెలుగులో ఆకాశమే నీ హద్దురా సినిమా ఇక్కడ సౌత్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాని హిందీలో ఇప్పుడు అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నాడు. సౌత్ లో ఈ సినిమా తెరకెక్కించిన సుధా కొంగర హిందీలో కూడా.....................

Akashay Kumar soorarai pottru remake release date fixed
Akashay Kumar : బాలీవుడ్(Boollywood) లో సౌత్ రీమేక్స్ మాత్రం ఆగట్లేదు. ఇక్కడ సూపర్ హిట్ సినిమాలని తీసుకొని వాళ్లకు నచ్చినట్టు మార్చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా అక్కడ ఫ్లాప్ అవుతున్నాయి. అయినా బాలీవుడ్ వాళ్ళు రీమేక్స్ ఆపట్లేదు. ముఖ్యంగా స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar). అక్షయ్ ఇప్పటికే చాలా సౌత్ రీమేక్స్ చేసాడు. అందులో 90 శాతం ఫ్లాప్స్ ఉన్నాయి. అయినా ఇంకా సౌత్ రీమేక్స్ ని వదిలిపెట్టట్లేదు.
అక్షయ్ కి గత రెండేళ్లుగా కలిసి రావట్లేదు. వచ్చిన ప్రతి సినిమా వచ్చినట్టు ఫ్లాప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 2021 లో సూర్యవంశీ పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ఆత్రాంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీ రాజ్, రక్షాబంధన్, కట్ ఫుట్లీ, రామ్ సేతు, సెల్ఫీ… ఇలా అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇందులో మూడు సినిమాలు రీమేక్ సినిమాలే కావడం విశేషం. ఇప్పుడు మరో రీమేక్ తో రాబోతున్నాడు అక్షయ్.
Brahmanandam : చచ్చేవరకు నేను కమెడియన్ నే.. మధ్యమధ్యలో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటా..
సూర్య హీరోగా వచ్చిన తమిళ్ సూరారై పొట్రు, తెలుగులో ఆకాశమే నీ హద్దురా సినిమా ఇక్కడ సౌత్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాని హిందీలో ఇప్పుడు అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నాడు. సౌత్ లో ఈ సినిమా తెరకెక్కించిన సుధా కొంగర హిందీలో కూడా తనే దర్శకత్వం వహిస్తుంది. హీరో సూర్య కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. 1 సెప్టెంబర్ 2023న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇందులో ఫిమేల్ లీడ్ గా రాధికా మదన్ నటిస్తోంది. హిందీ రీమేక్ కి ఇంకా టైటిల్ ని ప్రకటించలేదు. ఇప్పటికే అరడజనుకు పైగా ఫ్లాప్స్ చూసిన అక్షయ్ కి మరి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.
AKSHAY KUMAR – 'SOORARAI POTTRU' HINDI REMAKE: RELEASE DATE LOCKED… The #Hindi remake of #Tamil film #SooraraiPottru – starring #AkshayKumar – to release in cinemas on 1 Sept 2023… #SudhaKongara – who directed the original #Tamil version – directs. pic.twitter.com/qVaadIgsxr
— taran adarsh (@taran_adarsh) March 21, 2023