Akhanda 100 days : బాలయ్య అఖండ కృతజ్ఞత సభ.. 100 రోజుల స్పెషల్ ట్రైలర్ విడుదల..!

అఖండ సినిమా విజయవంతంగా 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్య అభిమానులు భారీగా తరలివచ్చారు. 100 రోజుల స్పెషల్ ట్రైలర్ విడుదల చేశారు.

Akhanda 100 days : బాలయ్య అఖండ కృతజ్ఞత సభ.. 100 రోజుల స్పెషల్ ట్రైలర్ విడుదల..!

Akhanda 100 Days Nandamuri Balakrishna Boyapati Sreenu Akhanda 100 Days Special Trailer Released

Balakrishna Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ మూవీ అఖండ. ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అఖండ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా STBC గ్రౌండ్స్ కర్నూలు‌లో అఖండ కృతజ్ఞత సభను ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు హీరో బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా విజయవంతంగా 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్య అభిమానులు ఈ ఫంక్షన్‌కు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 100 రోజుల స్పెషల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

బాలయ్యతోనే ఈ జీవితం ఇలానే కొనసాగాలి : బోయపాటి
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ సినిమాని బాలయ్య బాబు అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు ఆదరించారు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందన్నారు. ఒక మాస్ సినిమాలో నేచర్ గురించి భగవంతుడు గురించి చెప్పే స్కోప్ వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమ ప్రజలు ఒక సినిమా చూసి నచ్చింది అని అంటే ప్రపంచం మొత్తానికి నచ్చుతుందన్నారు. బాలయ్య బాబుతో నా జర్నీ ఈ జీవితాంతం ఇంతే సక్సెస్ ఫుల్‌గా కొనసాగాలని కోరుకుంటున్నానని బోయపాటి శ్రీను తెలిపారు.

మా సినిమాలు మాకు పోటీ.. సినిమా రంగం ఒక కుటీర పరిశ్రమ : బాలయ్య
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ చిత్రం శతదినోత్సవం పండుగకు విచ్చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి వందరోజుల ఫంక్షన్ జరుపుకొని ఎన్ని రోజులు అయ్యిందోనన్నారు. ఎప్పుడు ఇలాంటి సినిమా చెయ్యాలి అలాంటి సినిమా చెయ్యాలి అని ఎప్పుడు అనుకోలేదని, సినిమా స్టార్ట్ చేసిన తరువాత కరోనాతో ఇబ్బంది వచ్చిందన్నారు. అయినా ఎక్కడ వెనుకాడక సినిమా చేయడంతో రిలీజ్ అయిందని అన్నారు. మీరు అశేషంగా ఆదరించారు కనుకే.. ఈ సినిమా హైందవ సనాతన ధర్మంతో నిలబెట్టేందుకు మంచి సందేశాన్ని ఇచ్చిందని బాలయ్య చెప్పారు. మా యూనిట్ తరుపున మాకు ఇలాంటి చిత్రంలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు బాలయ్య తెలిపారు. కేవలం తెలుగొల్లమే కాదు యావత్ భారతదేశం తలెత్తుకుకొనేలా చేసిందన్నారు. ఈ విజయం చరిత్ర సృష్టించాలని ఆన్న మేమే దాన్ని తిరగ రాయాలన్న మేమే.. మా సినిమాలు మాకు పోటీ అన్నారు. సింహకి లెజెండ్ పోటీ దానికి అఖండ పోటీ అన్నారు. సినిమా రంగం ఒక కుటీర పరిశ్రమగా అభివర్ణించారు.

సినిమా రంగాన్నిఒక పరిశ్రమగా గుర్తించాలని మేము ఎప్పుడు అన్ని ప్రభుత్వాలను వేడుకోంటున్నామని తెలిపారు. సినిమా పరిశ్రమ గొప్పదన్నారు. అఖండ వంటి చిత్రాల ద్వారా సినీ పరిశ్రమ గొప్పదని నిరూపిస్తుందని బాలయ్య తెలిపారు. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడని, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళాడని ప్రశంసించారు. అమెరికాలో తమన్ సంగీతానికీ సౌండ్ బాక్సులు కూడా బద్ధలయ్యాయని కొనియాడారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నిషియన్స్ అందరూ అద్భుతంగా వర్క్ చేశారని, అఖండ కరోనాను కూడా లెక్క చేయకుండా షూటింగ్ జరిగిందన్నారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బాలయ్య చెప్పారు. అభిమానులు కేవలం సినిమాలను ప్రేమించడమే కాకుండా తాను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారని, అది వెలకట్టలేనిదన్నారు.

Read Also : Akhanda : కొత్త సినిమా సెట్‌లో బాలయ్య ‘అఖండ’ వేడుక..