Akhanda : 20 ఏళ్ల తర్వాత క్రాస్ రోడ్స్‌లో కోటి కొల్లగొట్టిన బాలయ్య!

2001 లో ‘నరసింహ నాయుడు’ రూ. 1 కోటి రూపాయల మార్క్ టచ్ చేసింది.. దాని తర్వాత 20 సంవత్సరాలకు ‘అఖండ’ సేమ్ ఫీట్ రిపీట్ చేసింది..

Akhanda : 20 ఏళ్ల తర్వాత క్రాస్ రోడ్స్‌లో కోటి కొల్లగొట్టిన బాలయ్య!

Nandamuri Balakrishna

Akhanda: ‘బాక్సాఫీస్ బొనాంజా’ బాలయ్యకు రికార్డులు క్రియేట్ చెయ్యడం.. తన రికార్డులను తానే బీట్ చెయ్యడం కొత్తేం కాదు. తెలుగు చలనచిత్ర చరిత్రలో 1000 రోజుల పాటు థియేటర్‌లో ఆడిన సినిమా (లెజెండ్) రికార్డు నటసింహ ఖాతాలోనే ఉంది. ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డ్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు బాలయ్య.

Akhanda : మల్టీప్లెక్స్‌లో మాస్ జాతర.. ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ అరాచకం..

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ బాక్సాఫీస్‌ని షేక్ చేసేసింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కేవలం కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్‌తో డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది ‘అఖండ’.

Akhanda 50 Days Jathara : బాలయ్య బాక్సాఫీస్ ‘మాస్ జాతర’.. ‘అఖండ’ గర్జనకు 50 రోజులు..

ఇటీవలే విజయవంతంగా 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని, ఓటీటీలోనూ రచ్చ రంబోలా చేస్తుంది ‘అఖండ’. డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ చేసిన 24 గంటల్లో ఏకంగా 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాలయ్య ఫ్యాన్స్ ఆ సంబరాల్లో ఉండగానే ఆదివారం (జనవరి 23) మరో గుడ్ న్యూస్ చెప్పాడు బాలయ్య.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

విడుదలైన ప్రతి సెంటర్‌లోనూ రూ. కోటి రూపాయల మార్క్ టచ్ చేసిన ‘అఖండ’ 50 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూ సరికొత్త రికార్డులు నెలకొల్పడం విశేషం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నటసింహ ‘అఖండ’ తో కోటి రూపాయల మార్క్ టచ్ చేశారు.

Akhanda : వన్స్ స్టెప్ ఇన్.. ఓటీటీలో ‘అఖండ’ ఆల్ టైమ్ రికార్డ్!

2001 లో ‘నరసింహ నాయుడు’ రూ. 1 కోటి రూపాయల మార్క్ టచ్ చేసింది. దాని తర్వాత 20 సంవత్సరాలకు ‘అఖండ’ సేమ్ ఫీట్ రిపీట్ చేసింది. బాలయ్య కెరీర్‌లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ. కోటి రాబట్టిన రెండవ సినిమాగా ‘అఖండ’ నిలిచింది. సుదర్శన్ థియేటర్‌లో 53వ రోజు మ్యాట్నీతో ఈ ఘనత సాధించాడు నటసింహ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Nbk Akhanda