Akhanda : దేశ విదేశాల్లో బాలయ్య క్రేజ్.. ఖండాంతరాలు దాటిన ‘అఖండం’

అఖండ' సినిమా ప్రభావం ఖండాంతరాలు దాటి వెళ్ళింది. దేశ విదేశాల్లో జై బాలయ్య అనే స్లొగన్స్ రచ్చ చేశాయి. రోడ్ల పై ర్యాలీలు, థియేటర్స్ ముందు కొబ్బరికాయలు కొట్టడాలు, థియేటర్స్ లో ఈలలు....

10TV Telugu News

Akhanda :  బాలయ్యబాబు బోయపాటి కాంబినేష్ లో వచ్చిన మూడో సినిమా ‘అఖండ’ నిన్న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ కి , తమన్ వీర కొట్టుడు మ్యూజిక్ కి థియేటర్స్ బద్దలయిపోయాయి. అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్న అన్ని దేశాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ చూసినా నిన్న ‘అఖండ’ మానియానే కనిపించింది.

Bigg Boss 5 : షణ్ముఖ్ ప్రియురాలితో సహా శ్రీరామచంద్రకు వెల్లువెత్తుతున్న సెలబ్రిటీల మద్దతు

‘అఖండ’ సినిమా ప్రభావం ఖండాంతరాలు దాటి వెళ్ళింది. దేశ విదేశాల్లో జై బాలయ్య అనే స్లొగన్స్ రచ్చ చేశాయి. రోడ్ల పై ర్యాలీలు, థియేటర్స్ ముందు కొబ్బరికాయలు కొట్టడాలు, థియేటర్స్ లో ఈలలు, అరుపులు, థియేటర్స్ బయట బ్యానర్లు…. నిన్న తెలుగు వాళ్ళు ఉండి ‘అఖండ’ సినిమా రిలీజ్ అయిన అన్ని దేశాల్లోనూ ఇదే జోరు కొనసాగింది. కొన్ని చోట్ల బాలయ్య అభిమానుల రచ్చకి థియేటర్ యాజమాన్యాలు కూడా భయపడ్డాయి. కొన్ని చోట్ల ఏకంగా పోలీసులే రంగంలోకి దిగారంటే విదేశాల్లో బాలయ్య బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

×