Akhanda: అఖండ మాస్ జాతర.. ఐదవ రోజూ కాసుల వర్షం!

ఇప్పుడు ఎక్కడ విన్నా అఖండ.. అఖండ.. అఖండ. బాలయ్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పర్‌ఫెక్ట్ మాస్ సినిమా కావడంతో థియేటర్లకు మాస్ జాతర పోటెత్తింది.

Akhanda: అఖండ మాస్ జాతర.. ఐదవ రోజూ కాసుల వర్షం!

Akhanda Trailer

Akhanda: ఇప్పుడు ఎక్కడ విన్నా అఖండ.. అఖండ.. అఖండ. బాలయ్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పర్‌ఫెక్ట్ మాస్ సినిమా కావడంతో థియేటర్లకు మాస్ జాతర పోటెత్తింది. బోయ‌పాటి శ్రీ‌ను-బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో సినిమా అఖండ.. పేరుకు తగ్గట్లే అఖండ విజయం సాధించింది. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచెలు చేస్తూ.. ఆడియన్స్‌ని జాతరకు రప్పించినట్లు రప్పించిన సినిమా అఖండ.

Pushpa Trailer: పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే.. షేక్ చేస్తున్న ట్రైలర్..!

బాలయ్య నుండి అభిమానులు ఏం కోరుకుంటారో.. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఏం ఆశిస్తారో అంతకు మించి దర్శకుడు బోయపాటి అఖండలో నింపేయడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అఖండ కేవలం అభిమానుల సినిమా మాత్రమేనని కొందరు కొట్టిపారేసిన రోజులు గడుస్తున్నా.. ప్రేక్షకుల మాస్ జాతర కొనసాగుతూనే ఉండగా.. కలెక్షల వరదా కొనసాగుతూనే ఉంది. ఐదవ రోజు కూడా సినిమా కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం వెనకడుగేయలేదు. వీకెండ్ పోయి సోమవారం వచ్చినా బాక్సాఫీస్ వద్ద కాసుల వరద పారుతూనే ఉంది.

Driving Licence: మరో రీమేక్‌పై వెంకీ చూపు.. లైసెన్స్ దక్కేనా?

ఐదవ రోజు వసూళ్లు ఏరియాల వారీగా అఖండ వసూళ్లు చూస్తే.. నైజాంలో 1.31 కోట్లు, సీడెడ్‌లో 91లక్షలు, ఉత్తరాంధ్రలో 38లక్షలు, ఈస్ట్ గోదావరిలో 57లక్షలు, వెస్ట్ గోదావరిలో 18లక్షలు, గుంటూరులో 24 లక్షలు, కృష్ణాలో 23లక్షలు, నెల్లూరులో 12లక్షలను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 3.58 కోట్లు షేర్ దక్కిగా 5.70 కోట్లు గ్రాస్ వచ్చింది. ఐదురోజులకు కలిపితే నైజాంలో 13.42 కోట్లు, సీడెడ్‌లో 10.72, ఉత్తరాంధ్రలో 4.12, ఈస్ట్ గోదావరిలో 2.82, వెస్ట్ గోదావరిలో 2.22 , గుంటూరులో 3.50, కృష్ణాలో 2.51, నెల్లూరులో 1.83కోట్ల చొప్పున వసూళ్లను సాధించింది. రెండు రాష్ట్రాల్లో కలిసి 41.14 కోట్లు షేర్ రాగా రూ. 64.80 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.49.04 కోట్లు వసూలు చేసింది.