Akhanda : ఓటీటీలో ‘అఖండ’.. ‘పుష్ప’ తర్వాతే..

ఇటీవల ఎంత హిట్ సినిమాలైనా త్వరగానే ఓటీటీకి వస్తున్నాయి. అలాగే 'అఖండ' కూడా త్వరలోనే ఓటీటీకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకి క్లారిటీ ఇచ్చింది ఓ ప్రముఖ ఓటీటీ....

Akhanda : ఓటీటీలో ‘అఖండ’.. ‘పుష్ప’ తర్వాతే..

Akhanda

Akhanda :  ఇటీవల డిసెంబర్ 2న థియేటర్స్ లో రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సినిమా ‘అఖండ’. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఈ సినిమా భారీ విజయంతో వీరిద్దరూ కలిసి హిట్ కొట్టారు. ఈ సినిమాతో బాలకృష్ణ మొదటి సారి 100 కోట్ల క్లబ్ లో కూడా చేరారు. దేశ విదేశాల్లో ఈ సినిమా సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయి నెల రోజులు పైనే అవుతున్న ఇంకా కొన్ని చోట్ల థియేటర్స్ కి ‘అఖండ’ కోసం జనాలు వస్తూనే ఉన్నారు. బాలయ్య మానియా ఆ రేంజ్ లో హిట్ చేసింది సినిమాని.

ఇటీవల ఎంత హిట్ సినిమాలైనా త్వరగానే ఓటీటీకి వస్తున్నాయి. అలాగే ‘అఖండ’ కూడా త్వరలోనే ఓటీటీకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకి క్లారిటీ ఇచ్చింది ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ. ఇప్పటికే ‘అఖండ’ తర్వాత రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. ‘పుష్ప’ సినిమా రేపట్నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో చాలా మంది ‘అఖండ’ కోసం కూడా ఎదురు చూస్తున్నారు.

Acharya : వివాదంలో ‘ఆచార్య’ సినిమా.. పోలీసులకి ఫిర్యాదు చేసిన RMPలు

అయితే ‘అఖండ’ సినిమా సంక్రాంతి తర్వాత జనవరి 21న డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ కానున్నట్లు హాట్‌ స్టార్‌ అధికారికంగా తన సోషల్ మీడియాలో వెల్లడించింది. అంటే సినిమా రిలీజ్ అయిన దాదాపు 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో జనవరి చివర్లో ఓటీటీలో కూడా ‘అఖండ’ సినిమా తన సత్తా చూపించబోతుంది.