Balakrishna : అభిమానుల కోరిక మేరకు.. మళ్ళీ థియేటర్లోకి ‘అఖండ’

కొన్ని ఏరియాలలో ఈ సినిమాని మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేయాలని అభిమానులు అడుగుతున్నారు కూడా. అయితే తాజాగా 'అఖండ' సినిమాని ఏప్రిల్ 1వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా.........

Balakrishna : అభిమానుల కోరిక మేరకు.. మళ్ళీ థియేటర్లోకి ‘అఖండ’

Akhanda

 

Akhanda :  గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజైన ‘అఖండ’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన ‘అఖండ’ సినిమాతో విజయం సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. బాలకృష్ణ కెరీర్లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. చాలా సంవత్సరాల తర్వాత థియేటర్స్ లో లాంగ్ రన్ లో 100 రోజులు ఆడిన సినిమాగా అఖండ మరో రికార్డు సాధించింది.

Nagababu : రాడిసన్ ఘటనపై స్పందించిన నాగబాబు

ఇక ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అవ్వడంతో ఆ సినిమాని థియేటర్లో చూస్తేనే కిక్ అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. కొన్ని ఏరియాలలో ఈ సినిమాని మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేయాలని అభిమానులు అడుగుతున్నారు కూడా. అయితే తాజాగా ‘అఖండ’ సినిమాని ఏప్రిల్ 1వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో రత్న మినీ అనే థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు మళ్ళీ ఈ సినిమాకి వస్తున్నారు. ఇక మరి కొన్ని చోట్ల కూడా అఖండ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.