Legend 2: బోయపాటితో అఖండ నిర్మాత ప్లాన్.. లెజెండ్ సీక్వెల్ చేస్తున్నారా?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. యాక్షన్ నుండి డైలాగులా వరకు ప్రతిదీ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సింహతో మొదలైన ఈ కాంబినేషన్ తాజాగా అఖండతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది.

Legend 2: బోయపాటితో అఖండ నిర్మాత ప్లాన్.. లెజెండ్ సీక్వెల్ చేస్తున్నారా?

Legend 2

Legend 2: బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. యాక్షన్ నుండి డైలాగులా వరకు ప్రతిదీ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సింహతో మొదలైన ఈ కాంబినేషన్ తాజాగా అఖండతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. అయితే మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు బాలయ్య.. అటు బోయపాటి కూడా మరో సినిమాకి సిద్దమే అని కూడా ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

Balakrishna: క్రేజీ టాక్.. సంపత్ నందితో బాలయ్య సినిమా?

కాగా.. ఇప్పుడు అభిమానుల కోరిక నెరవేరబోతుందని.. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని ఇప్పుడు సినీ వర్గాలలో చర్చ మొదలైంది. బాలయ్య కెరియర్ లో ది బెస్ట్ గా నిలిచిన లెజెండ్ సినిమా గురించి ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ రెండో సినిమా 2014లో విడుదలైన 2017 వరకు థియేటర్లో ఆడింది. ఇది నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. రాయలసీమలోని ఎమ్మిగనూరులో ఒక థియేటర్లో వెయ్యి రోజులకు పైగా లెజెండ్ సినిమా ఆడింది.

Balakrishna: మరో క్రేజీ కాంబినేషన్.. బాలయ్యతో ‘సర్కారు’ దర్శకుడు?

కాగా.. ఇప్పుడు లెజెండ్ సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయని టాక్. రీసెంట్ గా ఈ కాంబినేషన్ లో చేరిన అఖండ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించనున్నారట. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. లెజెండ్ సినిమాకి పొలిటికల్ లైన్ కలిపి పొలిటిక‌ల్ సెటైర్లు, పంచ్‌ల‌తో ఈ సినిమా క‌థ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఏపీలో ఎన్నిక‌ల మూమెంట్‌ను బ‌ట్టి కాస్త ముందుగానే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా వినిపిస్తుంది.