Akhanda : ‘అఖండ’ సీక్వెల్ ప్లాన్.. స్టోరీ ఇదేనా??

అఖండగా బాలకృష్ణ పోరాటం తర్వాత సినిమా క్లైమాక్స్​లో ‘ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి’ అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోవడానికి......

Akhanda : ‘అఖండ’ సీక్వెల్ ప్లాన్.. స్టోరీ ఇదేనా??

Akhanda

Akhanda :  క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాల్లో భారీ విజయం సాధించిన సినిమా ‘అఖండ’. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన ‘అఖండ’ భారీ విజయం సాధించడంతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే దాదాపు 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. బాలయ్య ఉగ్ర రూపం, బోయపాటి మాస్ టేకింగ్, తమన్ మ్యూజిక్, ఫైట్ సీన్స్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Pushpa : ‘పుష్ప’ టీం మెంబర్స్‌కి గోల్డ్‌రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్

అఖండగా బాలకృష్ణ పోరాటం తర్వాత సినిమా క్లైమాక్స్​లో ‘ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి’ అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. అయితే వెళ్లేముందు సినిమాలో మరో బాలకృష్ణ పాత్ర కూతురికి నీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నన్ను తలుచుకో నీ ముందు ఉంటాను అని మాట ఇస్తాడు. అంటే ఆ పాపకి ఆపద వస్తే మళ్ళీ అఖండ తిరిగొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ పాయింట్ మీదే సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచ‌న‌లో మేకర్స్ ఉన్నారని సమాచారం.

Bigg Boss Sohel : బిగ్‌బాస్ సోహెల్‌తో ‘వకీల్‌సాబ్’ భామ

పాప‌కు ఏదైనా స‌మ‌స్య రావడం, అఖండ తిరిగి రావ‌డంతో పాటు అసలు బాలకృష్ణ అఖండంగా ఎలా మారాడు అనే గతం కూడా ఈ సీక్వెల్ లో చూపిస్తారని వినిపిస్తుంది. ఇదే నిజమైతే మరోసారి బాలకృష్ణ ఇంకో విజయం సాధించేసినట్టే అభిమానులకు పండగే అని అంతా అనుకుంటున్నారు.