Agent Movie: ఎండాకాలమే బెస్ట్ అంటోన్న ఏజెంట్.. నిజమేనా..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఎలాంటి ఫిజిక్‌లోకి మారాడో మనం ఈ సినిమా పోస్టర్స్, సోషల్ మీడియాలో చూశాం.

Agent Movie: ఎండాకాలమే బెస్ట్ అంటోన్న ఏజెంట్.. నిజమేనా..?

Akhil Agent Movie To Release In April

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఎలాంటి ఫిజిక్‌లోకి మారాడో మనం ఈ సినిమా పోస్టర్స్, సోషల్ మీడియాలో చూశాం.

Akhil Agent Movie: సంక్రాంతిని సీనియర్లకే వదిలేస్తున్న అయ్యగారు.. ఇక ఉగాదే పక్కా..?

అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం తరుచూ మారుతూ వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ ప్రభావం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది దసరాకు ఏజెంట్ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ఈ సినిమా ఎప్పటికి వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు.

Agent Teaser: వైల్డ్ యాక్షన్‌తో అదరగొట్టిన స్టైలిస్ ఏజెంట్

కాగా, సంక్రాంతి రిలీజ్ అని.. అటుపై శివరాత్రికి అని సోషల్ మీడియాలో పలు డేట్స్ వినిపించినా, చిత్ర యూనిట్ మాత్రం ఏ డేట్ అనేది ఇంకా కన్ఫం చేయడం లేదు. అయితే తాజాగా ఈ సినిమాను ఏకంగా వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ నెల 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒక పాటలో ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీ చిందులు వేయనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈసారైనా ఏజెంట్ కరెక్ట్ డేట్‌కి వస్తాడో లేడో చూడాలి.