Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ భారీగా బాడీని....

Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?

Akhil Agent Twist Will Stun Everyone

Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ భారీగా బాడీని పెంచిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కష్టపడి మ్యాచో లుక్‌లోకి మారిపోయాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో ఏజెంట్‌గా అఖిల్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Agent: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ఏజెంట్

ముఖ్యంగా ఈ సినిమాలో ఏజెంట్ ఇచ్చే ట్విస్ట్‌తో ఆడియెన్స్ ఫ్యూజులు ఎగిరిపోతాయని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఏజెంట్‌గా అఖిల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆడియెన్స్‌ను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని వారు అంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదని, ప్రేక్షకుల ఊహకు ఏమాత్రం అందకుండా ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

Agent: ఏజెంట్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..?

ఏదేమైనా ఏజెంట్ సినిమాపై చిత్ర యూనిట్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన అతుల్యా రవి, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించగా, హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.