Agent Movie: ఎట్టకేలకు ‘ఏజెంట్’పై మాసివ్ అప్డేట్ వచ్చేస్తుందోచ్!
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను ఓ స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాను గతేడాదిలోనే రిలీజ్ చేస్తామని చెప్పినా, కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆస్తిగా చూస్తున్నారు.

Agent Movie: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను ఓ స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాను గతేడాదిలోనే రిలీజ్ చేస్తామని చెప్పినా, కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆస్తిగా చూస్తున్నారు.
Agent Movie: కొత్త సంవత్సరం రోజున కొత్త రిలీజ్ డేట్‌తో వస్తున్న ఏజెంట్..?
అయితే, తాజాగా ఈ సినిమా నుండి ఓ మాసివ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇన్ని రోజుల తరువాత ఏజెంట్ మూవీ నుండి అప్డేట్ వస్తుందనే వార్తతో అభిమానుల్లో ఒక్కసారిగా ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. ఇక అఖిల్‌ను సరికొత్త అవతారంలో ఈ సినిమాలో చూపెడుతుండటంతో ఈ సినిమా నుండి రాబోయే అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఈ అప్డేట్‌ను ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 2.04 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కాగా, ఈ సినిమాకు సంబంధించి సరికొత్త రిలీజ్ డేట్‌ను రేపు ప్రకటిస్తారనే టాక్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తోండగా, సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. హిప్‌హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
Dear AKKineni Agents, what do you think is the best date for a telugu film release in history. https://t.co/Jy5zYWURYh
— Anil Sunkara (@AnilSunkara1) February 2, 2023