Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసుకుంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా అనుకున్న సమయానికంటే చాలా....

Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?

Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసుకుంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీని పూర్తిగా మార్చేశాడు. బీస్ట్ మోడ్‌లోకి మారిపోయిన అఖిల్, ఈ సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?

పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఏజెంట్ సినిమాను పలుమార్లు రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చి, అటుపై రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఆగస్టు నెలలో ఏజెంట్ సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా చెప్పుకొచ్చింది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా జరగలేదని తెలుస్తోంది.

Agent: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ఏజెంట్

కాగా, దసరా సీజన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నా.. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ సినిమా దసరా బరిలో కూడా రాకపోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన ఈ సినిమాను ఇక డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే, అక్కినేని అభిమానులకు మరోసారి తీవ్ర నిరాశ తప్పదని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ సాక్షి వైద్యా నటిస్తుండగా, హిప్‌హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా రిలీజ్‌ను నిజంగానే వెనక్కి నెడుతున్నారా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.