Akhil Akkineni: శివరాత్రి వరకు జాగారం చేయనున్న ఏజెంట్..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ గతకొంత కాలంగా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోంది. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ తన సినిమా ఏజెంట్ రిలీజ్‌ను మరోసారి వాయిదా వేసుకోబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Akhil Akkineni: శివరాత్రి వరకు జాగారం చేయనున్న ఏజెంట్..?

Akhil Akkineni Agent Movie To Release In February

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ గతకొంత కాలంగా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోంది. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Agent Movie: సంక్రాంతి బరిలోనే అఖిల్ ‘ఏజెంట్’.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

అయితే ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని గతంలో వెల్లడించింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతి బరిలో కూడా రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణలతో పాటు తమిళ హీరో విజయ్ కూడా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇలా సీనియర్ హీరోలకు పోటీ ఇవ్వడం ఇష్టం లేక, అఖిల్ తన సినిమా ఏజెంట్ రిలీజ్‌ను మరోసారి వాయిదా వేసుకోబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Agent: అఖిల్ “ఏజెంట్” నుంచి అదిరిపోయే అప్డేట్..

ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివరాత్రి కానుకగా ఏజెంట్ సినిమాను రిలీజ్ చేస్తే, పండగ సీజన్ కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఏదేమైనా శివరాత్రి వరకు ఏజెంట్ సినిమా రిలీజ్ కాదనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాను స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాను ఫిబ్రవరిలోనైనా రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.