Akhil Akkineni: కిరణ్ అబ్బవరం కోసం ఏజెంట్ ఎంట్రీ ఇస్తున్నాడు!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Akhil Akkineni: కిరణ్ అబ్బవరం కోసం ఏజెంట్ ఎంట్రీ ఇస్తున్నాడు!

Akhil Akkineni To Grace Kiran Abbavaram VBVK Pre-Release Event

Akhil Akkineni: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Kiran Abbavaram: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూడో పాట అప్డేట్ ను పట్టుకొస్తున్న కిరణ్ అబ్బవరం

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్‌ను తిరుపతిలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా యంగ్ హీరో అఖిల్ అక్కినేని హాజరుకాబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Vinaro Bhagyamu Vishnu Katha: వినరో భాగ్యము విష్ణు కథ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?

అఖిల్ రాకతో ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు సంబంధించిన డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కాశ్మీర పరదేశి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.