బ్యాచ్‌లర్ బాబుతో బుట్టబొమ్మ.. పిక్ వైరల్..

  • Published By: sekhar ,Published On : September 18, 2020 / 08:40 PM IST
బ్యాచ్‌లర్ బాబుతో బుట్టబొమ్మ.. పిక్ వైరల్..

Akhil and Pooja Hegde pic Viral: ఖిల్‌ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది.


‘ద బ్యాండ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ షూటింగ్‌ స్పాట్‌లో కార్వాన్‌ ముందు మేకప్‌ ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌తో కలిసి తీసుకున్న పిక్ పోస్ట్ చేసింది పూజ.. ఇప్పటి వరకు పూజపై సీన్స్ చిత్రీకరించారు. తాజాగా అఖిల్ షూట్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా సెట్‌లో పూజ, అఖిల్‌ కలిసి తీసుకున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ ఫొటోలో ఇద్దరూ మాస్కులు ధరించలేదు.. దీంతో ప్రేక్షకులు ఏమైనా అనుకుంటారేమో.. అని చెప్పి దానికి వాళ్లే వివరణ ఇచ్చారు.


‘‘తిరిగి వర్క్‌లోకి చేరడం చాలా గొప్ప ఫీలింగ్‌ ఇస్తుంది. జీవితం ఇప్పుడిప్పుడే కదులుతున్నట్లుగా ఉంది. ఈ ఫీలింగ్‌ చాలా బాగుంది. మాస్క్ లేకుండా మేము మాత్రమే ఉన్నామని నేను హామీ ఇస్తున్నాను. లేదంటే మీరు ఈ సినిమలా మమ్మల్ని గుర్తుపట్టలేరు..’’ అని అఖిల్‌ పోస్ట్ చేయగా.. ‘‘ఈ కరోనా టైమ్‌లో రొమాంటిక్-కామెడీని చిత్రీకరించే ప్రయత్నంలో మేమిద్దరం మాత్రమే సామాజిక దూరం పాటించడం లేదు..’’ అని పూజ కామెంట్ చేసింది.

https://www.instagram.com/p/CFREAdjBijg/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CFRPfmQBFNx/?utm_source=ig_web_copy_link