అక్కినేని హార్స్ రైడింగ్.. ప్రియ‌మైన నాన్న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు..

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 04:23 PM IST
అక్కినేని హార్స్ రైడింగ్.. ప్రియ‌మైన నాన్న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు..

Akhil Birthday wishes to Nagarjuna: వ‌య‌సు పెరిగే కొద్ది ఆయ‌న ఇంకా యంగ్‌గా త‌యార‌వుతున్నారు. ఆయ‌నే టాలీవుడ్ మ‌న్మ‌థుడు.. కింగ్ నాగార్జున‌. ఆగ‌స్ట్ 29న ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో నాగార్జున త‌న‌యుడు, హీరో అఖిల్ తండ్రితో త‌న‌కున్న అనుబంధాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.



‘‘ఈ ఫొటో మా మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేస్తుంది. నేను ప‌రిగెత్తే స‌మ‌యంలో ఆయ‌న నా వెన‌కే అండ‌గా ఉంటూ వ‌చ్చారు. నాతో పాటు జీవితాంతం న‌డిచారు. యవ్వ‌నం, ఫిట్‌నెస్‌, త‌ర‌గ‌ని ఫేమ్ వీట‌న్నింటినీ మించి ఆయ‌న ఆలోచ‌న గొప్ప‌గా, కొత్త‌ద‌నంతో తొణికిస‌లాడుతూ ఉంటుంది. చాలా సైలెంట్‌గా న‌వ్వుతూ స్థిరంగా ఉంటారు. మీరొక గొప్ప మాన‌వ‌తావాది. నా ప్రియ‌మైన నాన్న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు’’ అని చెబుతూ నాగార్జున‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు అఖిల్ అక్కినేని. అలాగే యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంత కూడా నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. నాగ్ వీరందరి ట్వీట్లకు రిప్లై ఇచ్చారు.