Akhil : విరాట్ కోహ్లీ బయోపిక్ లో అఖిల్ ??

అఖిల్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలనుకుంటున్నానని తెలిపాడు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు మంచి క్రికెటర్ అని చాలా మందికి తెలుసు. క్రికెట్ లో శిక్షణ

Akhil : విరాట్ కోహ్లీ బయోపిక్ లో అఖిల్ ??

Akhil

Akhil :  అక్కినేని అఖిల్ నాలుగో చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల అవుతుంది. అఖిల్ నటించిన తొలి మూడు సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు. ఈ సారైనా హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. అఖిల్ తన టీంతో కలిసి ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం టాప్ లో ఉన్న పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

అఖిల్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలనుకుంటున్నానని తెలిపాడు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు మంచి క్రికెటర్ అని చాలా మందికి తెలుసు. క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో క్రికెటర్ గా తన సత్తా కూడా చాటాడు. హీరో అవ్వకపోతే తాను ఖచ్చితంగా క్రికెటర్ అయ్యేవాడ్ని అని చాలా సార్లు చెప్పాడు. తను పర్ఫెక్ట్ స్పోర్ట్ పర్సనాలిటీ అని నిరూపించేందుకే విరాట్ బయోపిక్ లో నటిస్తానని తెలిపాడు. తనకు కోహ్లీ అంటే చాలా ఇష్టం అని, అతడి ఆటను మొదటి నుంచి పరిశీలిస్తున్నానని అఖిల్ వివరించారు.

Hameeda : నాకు కావాల్సిన ప్రేమ శ్రీరామ్ దగ్గర దొరికింది.. కానీ.. : హమీదా

తను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు అఖిల్ తెలిపాడు. సినిమా బలంగా ఉండాలంటే స్పోర్ట్స్ బయోపిక్ లకు బలమైన కంటెంట్ అవసరమని, కథ బాగుంటే తప్ప ఆట తెరపై హైలైట్ కాదని అఖిల్ అన్నారు. విరాట్ బయోపిక్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. విరాట్ కోహ్లీ జీవితం అభిరుచి, అంకితభావంతో నిండి ఉంది. అతడిలో అగ్ని ఉంది. అతను నన్ను చాలా విధాలుగా ప్రభావితం చేశాడు. ఏదో ఒకరోజు అతనిపై కథ రాస్తే చాలా బాగుంటుంది. అందులో నేను నటించడాని అన్నివిధాలా ప్రయత్నిస్తాను అని తెలిపాడు. మన క్రికెటర్ల బయోపిక్ లు బాలీవుడ్ లోనే తీస్తారు ఎక్కువగా. ఇప్పుడే కాకపోయినా భవిష్యత్తులో అయినా విరాట్ బయోపిక్ ఖచ్చితంగా తీస్తారు. మరి అప్పుడు అఖిల్ కి ఛాన్స్ వస్తుందా? అఖిల్ డ్రీం ప్రాజెక్ట్ నెరవేరుతుందా చూడాలి.