Akhil : అయ్యగారి ఫ్యాన్ ని కలుస్తా అంటున్న అఖిల్

అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు. ఈ లైవ్ లో అఖిల్‌ వీరాభిమాని​ ‘అయ్యగారి ఫ్యాన్‌’ పై స్పందించాడు. అతని గురించి నాకు తెలుసు. నిజానికి నాకంటే అతనే ఎక్కువ ఫేమస్‌ అయ్యిండొచ్చు

Akhil : అయ్యగారి ఫ్యాన్ ని కలుస్తా అంటున్న అఖిల్

Akhil

Akhil :  అక్కినేని అఖిల్‌ మూడు సినిమాల తర్వాత ఫస్ట్ టైం హిట్ కొట్టాడు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా ఇటీవల దసరా సందర్భంగా విడుదలై మంచి విజయం సాధించింది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టాడు. ఐతే అఖిల్ సినిమాల రిలీజ్ టైంలో ఓ అఖిల్ వీరాభిమాని సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తాడు. గతంలో అయ్యగారూ అంటూ అఖిల్ ని పొగుడుతూ థియేటర్ దగ్గర హడావిడి చేసిన ఈ అభిమాని సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయాడు.ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాకి కూడా థియేటర్ దగ్గర హడావిడి చేసి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఈ అయ్యగారు అనే పదం ఎంత ఫేమస్ అయిందంటే ఏకంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనే వాడేశారు. ఇప్పుడు ఈ అభిమాని పై హీరో అఖిల్ స్పందించాడు.

Anasuya: కోట శ్రీనివాసరావుపై అనసూయ ఆగ్రహం.. వారిని ప్రశ్నించరా?

తాజాగా అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు. ఈ లైవ్ లో అఖిల్‌ వీరాభిమాని​ ‘అయ్యగారి ఫ్యాన్‌’ పై స్పందించాడు. “అతని గురించి నాకు తెలుసు. నిజానికి నాకంటే అతనే ఎక్కువ ఫేమస్‌ అయ్యిండొచ్చు. రోజూ సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఆయ్యగారు అనే పదం అంత ఫేమస్ అయింది కాబట్టే సినిమాలో కూడా వాడాము. బ్రదర్‌ నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నా, నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు కృతజ్ఞతలు” అని అన్నాడు. త్వరలోనే అఖిల్ తన వీరాభిమానిని కలవనున్నారు. ఇక ఈ విషయం అఖిల్ అయ్యగారి ఫ్యాన్ ని కలవబోతున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.