Most Eligible Bachelor: హిట్ కొడతానని అఖిల్ శపథం.. అంత కాన్ఫిడెంట్ ఏంటో!

హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఒక్క బ్లాక్ బస్టర్ కూడా దక్కించుకోని అఖిల్.. సక్సెస్ కొట్టేవరకూ నిద్రపోనంటున్నాడు. అఖిల్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..

Most Eligible Bachelor: హిట్ కొడతానని అఖిల్ శపథం.. అంత కాన్ఫిడెంట్ ఏంటో!

Most Eligible Bachelor

Most Eligible Bachelor: హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఒక్క బ్లాక్ బస్టర్ కూడా దక్కించుకోని అఖిల్.. సక్సెస్ కొట్టేవరకూ నిద్రపోనంటున్నాడు. అఖిల్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిజల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ టాలీవుడ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్, పూజాహెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15 పండగరోజు రిలీజ్ కు రెడీ అవుతోంది.

Hamsa Nandini: సిగ్గులు ఒలుకుతున్న హంసా.. కుర్రాళ్ళకెందుకీ హింసా!

రిలీజ్ కు వారం ఉండడంతో ప్రమోషన్స్ పీక్స్ లోస్టార్ట్ చేశారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ ఈ సినిమాతో సక్సెస్ కొట్టి తీరతానని, అంతవరకూ నిద్రపోనని శపథం చేసి మరీ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ మీద అఖిల్ తో పాటు యూనిట్ మొత్తం అంతే ధీమాగా ఉన్నాడు. సినిమా సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి.

Liger: మరింత ఆలస్యంగా రానున్న రౌడీ హీరో.. కారణం ఏంటంటే?

అంతేకాదు.. స్టార్ కాస్ట్ కూడా సినిమా రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపించేలా ఉండడంతో సినిమా హిట్టే అన్న పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అఖిల్ కు జంటగా చేస్తున్న పూజాహెగ్డే కెరీర్ లో ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్ అని అంతే కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఈవెంట్ కి అటెండ్ అయిన నాగచైతన్య, ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ డైరెక్టర్ భాస్కర్ ఇలా అందరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Acharya: చిరు ఈ ఏడాది వస్తాడా.. లేక వచ్చే ఏడాదికి వెళ్తాడా?

తన ఏజ్ కి, పర్సనాలిటీకి సూట్ అయ్యేలా మంచి లవ్ ఎంటర్ టైనర్ సెలక్ట్ చేసుకున్న అఖిల్.. ఈ సినిమాలో మ్యారీడ్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోడానికి ఇబ్బందిపడే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకూ అఖిల్ చేసిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఈ సినిమా స్పెషల్ కేర్ తీసుకుని మరీ చేశారు. అందుకే గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందంటున్నాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.