Akhila Ram : ఆహాలో మాసూద.. దెయ్యంగా చేసిన అమ్మాయిని రియల్ గా చూశారా??

థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మసూద సినిమాని ఓటీటీలో చూసి కూడా భయపడుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ ఫిలిం అని అంటున్నారు. మౌత్ టాక్ తో ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఇందులో దయ్యంగా బుర్ఖా వేసుకొని ఒక అమ్మాయి నటించింది. సినిమా మొత్తం కూడా..............

Akhila Ram : ఆహాలో మాసూద.. దెయ్యంగా చేసిన అమ్మాయిని రియల్ గా చూశారా??

Akhila Ram acted as Ghost Character in Masooda Movie

Akhila Ram :  మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలతో మెప్పించిన నిర్మాత రాహుల్ యాదవ్ ఇటీవల మసూద అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ సాయికిరణ్ ఈ సినిమాని తెరకెక్కించగా తిరువీర్, కావ్య కళ్యాణ్, సంగీత, బంధవి శ్రీధర్, సత్యం రాజేష్, శుభలేఖ సుధాకర్.. పలువురు ఈ సినిమాలో నటించారు.

సినిమా బాగుండటంతో దిల్ రాజు ఈ సినిమాని రిలీజ్ చేశాడు. అంచనా వేసినట్టే ఈ సినిమా మంచి విజయం సాధించింది. నవంబర్ 18న థియేటర్స్ లో రిలీజయిన మసూద సినిమా అందర్నీ భయపెడుతూ మంచి విజయం సాధించింది. పెట్టిన దానికి లాభాలు తీసుకురావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. అనంతరం ఇటీవలే ఆహాలో డిసెంబర్ 21 నుంచి మసూద సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మసూద సినిమాని ఓటీటీలో చూసి కూడా భయపడుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ ఫిలిం అని అంటున్నారు. మౌత్ టాక్ తో ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఇందులో దయ్యంగా బుర్ఖా వేసుకొని ఒక అమ్మాయి నటించింది. సినిమా మొత్తం కూడా కేవలం కళ్ళు మాత్రమే చూపిస్తూ అదరగొట్టి భయపెట్టింది. సినిమాలో ఒక చోట ఫొటోలో మాత్రం పేస్ రివీల్ చేసినా అంతగా క్లారిటీ ఉండదు. ఇటీవల కొన్ని రోజుల క్రితమే ఆ దయ్యంగా నటించిన అమ్మాయిని పరిచయం చేశారు చిత్ర యూనిట్.

Rashmika : ఇకపై మిమ్మల్ని ప్రతి సంవత్సరం కలుస్తాను.. వర్చువల్ ఫ్యాన్స్ మీట్ ప్లాన్ చేస్తోన్న రష్మిక..

అఖిల రామ్ అనే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. బయట ఇంత అందంగా ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి ముఖం బురఖాతో కప్పేసి దయ్యాన్ని చేసేసారుగా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మసూద సక్సెస్ మీట్స్ లో దయ్యంగా చేసింది ఈమె అని అఖిల రామ్ ని పరిచయం చేయడంతో ఒక్కసారిగా ఈమె వైరల్ గా మారింది. ఈమె ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. గతంలో ఈమె కొన్ని సినిమాల్లో నటించగా ఇప్పుడు మసూదతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అఖిల పోస్ట్ చేసిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.