Akhil : ఏజెంట్ అఖిల్ తో మాట్లాడాలనుకుంటున్నారా?? ఇదే ఛాన్స్.. మిస్ అవ్వకండి..

ఇప్పటివరకు లవ్ సినిమాలతో మెప్పించిన అక్కినేని అఖిల్ ఈ సారి ఫుల్ యాక్షన్ మోడ్ లో ఏజెంట్ సినిమాతో గ్రాండ్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. సమ్మర్ లో ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ సినిమాని..............

Akhil : ఏజెంట్ అఖిల్ తో మాట్లాడాలనుకుంటున్నారా?? ఇదే ఛాన్స్.. మిస్ అవ్వకండి..

Akkineni Akhil Plan to talk with fans in twitter space

Akhil : ఇటీవల చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు, హీరోయిన్స్, సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ప్రమోషన్స్, ఫ్యాన్ మీట్స్, సోషల్ మీడియాలో చిట్ చాట్.. ఇలా రకరకాల పద్ధతుల్లో సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నాలు, అభిమానులతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా ఫోటోలు, వాళ్ళ సినిమాల గురించి షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కినేని అఖిల్ అభిమానులతో ముచ్చటించడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటివరకు లవ్ సినిమాలతో మెప్పించిన అక్కినేని అఖిల్ ఈ సారి ఫుల్ యాక్షన్ మోడ్ లో ఏజెంట్ సినిమాతో గ్రాండ్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. సమ్మర్ లో ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అఖిల్, అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖిల్ అభిమానులతో ముచ్చటించడానికి రెడీ అయ్యాడు.

Sir Premieres : తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ‘సార్’ ప్రీమియర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సార్ ప్రీమియర్ షో టికెట్లు..

ఫిబ్రవరి 22న ట్విట్టర్ స్పేస్ లో అభిమానులతో మాట్లాడబోతున్నాను అంటూ అఖిల్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే అఖిల్ అభిమానులతో ట్విట్టర్ స్పేస్ లో ముచ్చటించనున్నాడు. మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలియచేయనున్నారు. అఖిల్ మొదటి సారి సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడనుండటంతో ఫ్యాన్స్ అఖిల్ తో మాట్లాడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకే మీరు కూడా ఫిబ్రవరి 22న ట్విట్టర్ స్పేస్ లో జాయిన్ అయి అఖిల్ తో మాట్లాడేయండి.