Bangarraju: సంక్రాంతికి ఉన్నట్లా.. లేనట్లా? టెన్షన్ పెట్టేస్తున్న అక్కినేని హీరోలు!

అక్కినేని హీరోలు వారి అభిమానులను తెగ టెన్షన్ పెట్టేస్తున్నారు. సంక్రాంతి వస్తారా లేక వాయిదా వేసుకుంటారా అన్నది తెలియక సతమతమైపోతున్నారు. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య..

Bangarraju: సంక్రాంతికి ఉన్నట్లా.. లేనట్లా? టెన్షన్ పెట్టేస్తున్న అక్కినేని హీరోలు!

Bangarraju

Bangarraju: అక్కినేని హీరోలు వారి అభిమానులను తెగ టెన్షన్ పెట్టేస్తున్నారు. సంక్రాంతి వస్తారా లేక వాయిదా వేసుకుంటారా అన్నది తెలియక సతమతమైపోతున్నారు. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య ఈసారి జబర్దస్తీ ఎంటర్ టైనర్ తో వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగ్ ఐదేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఆ సినిమా విడుదలైన సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రకటించి ఇప్పుడు అదే మాటతో సీక్వెల్ తో వచ్చేస్తున్నారు.

Gopichand 30: మ్యాచోస్టార్ మొదలు పెట్టేస్తున్నాడు.. హ్యాట్రిక్ కొడతారా?

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ మంచి అప్లాజ్ దక్కించుకుంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో రెండు పాత్రలు నాగ్ చేయగా సీక్వెల్ బంగార్రాజు సినిమాలో భారీ క్యాస్టింగ్ తోడైంది. నాగ్ రమ్యకృష్ణలకు తోడుగా నాగ చైతన్య, కృతి శెట్టిలను కూడా తీసుకున్న మేకర్స్ ఆ పాత్రల నిడివిని కూడా పెంచి దీన్నో మల్టీస్టారర్ సినిమాగా సిద్ధం చేశారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడొస్తుందా అన్నది మేకర్స్ నుండి డైలమా కొనసాగుతుంది. జనవరి 15న ఈ సినిమా విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు.

Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

అయితే, సంక్రాంతికి ముహుర్తాలు పెట్టేసుకున్న సినిమాలన్నీ ఒక్కటిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. మహేష్ సర్కారు వారి పాట ముందుగా వాయిదా పడగా.. తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా వాయిదా పడింది. దీంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రెండో సంక్రాంతి రిలీజ్ ఖరారు చేసుకున్నాయి. అయితే, బంగార్రాజు మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన లేదు. ముందు చెప్పినట్లుగా జనవరి 15న వస్తారా లేక వాయిదా వేసుకుంటారా అన్నది అర్ధం కావడంలేదు. దీంతో అభిమానులు దర్శక, నిర్మాతల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరి నాగ్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.