Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..

ప్రస్తుతం అక్కినేని హీరోలెవరూ ఖాళీగా లేరు. వరస పెట్టి సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, అఖిల్, నాగార్జున.. ముగ్గురూ కూడా..................

Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..

Nagarjuna

Akkineni Heros :  ప్రస్తుతం అక్కినేని హీరోలెవరూ ఖాళీగా లేరు. వరస పెట్టి సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, అఖిల్, నాగార్జున.. ముగ్గురూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే సమంతతో విడాకుల తర్వాత వచ్చిన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ కొట్టాడు. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్యాంక్ యు సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాతో కూడా విజయం సాధించి ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు చైతూ. ఇలా ఒక పక్క వరుస విజయాలు సాధిస్తూ మరో పక్క వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత వెబ్ సిరీస్ ని కూడా మొదలుపెట్టి ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు త్వరలో. ఇక సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న పరశురామ్ తో సినిమా ఓకే చేసి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఇలా థియేటర్లు, ఓటీటీ కవర్ చేస్తూ చాలా బిజీ అవుతున్నాడు చైతూ.

ఇక తమ్ముడు అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టడంతో చాలా జాగ్రత్తగా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఏజెంట్ సినిమా మీదే ఫోకస్ పెట్టాడు అఖిల్. ఈ సారి కూడా కచ్చితంగా హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. ఏజెంట్ సినిమా కోసం తన బాడీని చాలా చేంజ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ కాప్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మనాలిలో షూటింగ్ జరుపుకుంటుంది.

Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..

కొడుకులు ఇద్దరూ బిజీ ఉంటే తండ్రి తక్కువా అంటూ నాగార్జున కూడా అటు సినిమా, ఇటు టీవీ షూట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ పూర్తి చేసుకున్న నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ సీజన్6 కూడా మొదలు పెట్టనున్నారు. మరో పక్క ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఘోస్ట్ సినిమా కూడా చాలా వేగంగా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత సినిమా కోసం కథలు కూడా వింటున్నాడు నాగార్జున. ఇలా ముగ్గురు అక్కినేని హీరోలు ఇటీవల చాలా బిజీగా మారిపోయారు.