Akkineni Nagarjuna: ప్రపంచంలో ఎలాంటి వాళ్లైనా తుడిచిపెట్టుకుపోతారు – అక్కినేని నాగార్జున

కింగ్ నాగార్జునలో కొవిడ్ మహమ్మారి రియలైజేషన్ పుట్టించిందట. సాధారణంగా మొదలైన 2020 సంవత్సరంలో అలజడి సృష్టించిన కరోనా మహమ్మారి 2021లోనూ సెకండ్ వేవ్ తో రచ్ఛ చేసింది.

Akkineni Nagarjuna: ప్రపంచంలో ఎలాంటి వాళ్లైనా తుడిచిపెట్టుకుపోతారు – అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna Pandemic Made Me Realise

Akkineni Nagarjuna: కింగ్ నాగార్జునలో కొవిడ్ మహమ్మారి రియలైజేషన్ పుట్టించిందట. సాధారణంగా మొదలైన 2020 సంవత్సరంలో అలజడి సృష్టించిన కరోనా మహమ్మారి 2021లోనూ సెకండ్ వేవ్ తో రచ్ఛ చేసింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన ప్రాణాంతక వైరస్ ప్రభావంతో ప్రాణాలను కాపాడుకోవడమే కష్టంగా మారింది.

ఈ పరిస్థితుల్లో తనలో పుట్టిన రియలైజేషన్, తన అనుభవాలను కింగ్ నాగార్జున మీడియాతో ఇలా పంచుకున్నారు. షూటింగులకు కాస్త బ్రేక్ చెప్పడం లేదా పూర్తి చేయడం వంటి టాస్కులు మార్చుకుని పూర్తిగా పాజిటివ్ అంశాలపైనే ఫోకస్ పెట్టారట. .

సహనం, వినయం గురించి
‘సహనం, వినయం గురించి చాలా నేర్చుకున్నాను. అంతేకాకుండా.. నువ్వు చాలా గొప్ప అనుకోవద్దని ఏ క్షణంలోనైనా తుడిచిపెట్టుకుని పోతావని కరోనావైరస్ నేర్పిందని అంటున్నారు. మనమే కాదు ప్రపంచమంతా తుడిచిపెట్టుకోగలదని తెలుసుకున్నా. అందుకనే మనకు ఎఫెక్ట్ రాదు.. మనమేం ప్రత్యేకం కాదనే విషయం తెలుసుకోవాలని అంటున్నారు.

Nagarjuna 235

Nagarjuna 235

కుటుంబంతో పాటు సమయం గడపటం, ఆత్మ పరిశీలనకు కూడా చాలా సమయం దొరికింది. చాలా కాలంగా కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నా. ఇటువంటి అంశాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కొన్ని నెలలుగా అంతా ఆగిపోయేసరికి రియలైజ్ అయ్యాను.

కొన్ని రిలీజ్‌కు నోచుకోని సినిమాలు
ఇక ఫిల్మ్ మేకర్స్ కు గుడ్ న్యూస్ ఏంటంటే ఓటీటీలు ఊపందుకోవడం. డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసేందుకే ఇంటరెస్ట్ చూపించక కొన్ని రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కూడా అందులో విడుదల అవగలుగుతున్నాయి. ఈ ఓటీటీల వల్ల కథలు ఎంచుకోవడానికి, పాత్రలతో ప్రయోగం చేయడానికి మంచి అవకాశం ఉంది. ఈ ఐడియా చాలా బాగుంది. ఈ కొత్త ప్లాట్‌ఫాంపై సినిమాల్లో చేయలేని ప్రయోగాలు చేసేందుకు వీలుంటుంది’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కింగ్ నాగ్.

Nagarjuna 1

Nagarjuna 1

ఒకసారి థియేటర్లు రీ ఓపెన్ అయితే వెండితెర మీద సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని తన తర్వాతి ప్రాజెక్టు గురించి రివీల్ చేయకుండానే ముగించారు నాగ్.