Akshay – Salman : ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కి అక్షయ్, సల్మాన్ స్టెప్పులు..

స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'సెల్ఫీ' విడుదలకు సిద్దమవుతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ మొత్తం తన భుజాలు మీద వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశాడు.

Akshay – Salman : ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కి అక్షయ్, సల్మాన్ స్టెప్పులు..

Akshay - Salman

Akshay – Salman : సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ పరిశ్రమ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అది చెరుపుకొనే పనిలో పడ్డారు బి-టౌన్ హీరోలు. ఈ క్రమంలోనే ఒకరి సినిమా కోసం మరొకరు సహాయం చేసుకుంటున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర చేసి సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాడు. ఇప్పుడు మరో హీరోకి కూడా తన సాయం అందిస్తున్నాడు ఈ కండల వీరుడు. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫీ’ విడుదలకు సిద్దమవుతుంది. ఈ నెల 24న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Shahrukh Khan – Salman Khan : షారుఖ్ అయిపోయింది.. నెక్స్ట్ సల్మాన్..?

అక్షయ్ గత నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేక పోయాయి. ఈ సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. దీంతో మూవీ ప్రమోషన్స్ మొత్తం తన భుజాలు మీద వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశాడు. తన పాత సినిమాలోని ‘మే ఖిలాడి తు అనారీకి’ పాటని ఈ మూవీలో రీమేక్ చేస్తున్నాడు. ఆ పాటకి సల్మాన్ తో కలిసి అక్షయ్ ఒక రీల్ చేసి పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి హిట్ పాటకి స్టెప్పులు వేస్తుంటే.. అది చూసిన ఇద్దరి అభిమానులకే కాదు, ఇండస్ట్రీ వాళ్లకి కూడా కన్నుల విందులా ఉంది. ఈ రీల్ పోస్ట్ చేస్తూ అక్షయ్.. ‘సల్మాన్ భాయ్ స్టెప్స్ ని చూసి క్షణాల్లో దాని రీ క్రియేట్ చేశాడు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. మలయాళ హీరో పృథివిరాజ్ సుకుమారన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. హిందీలో డైరెక్టర్ రాజ్ మెహతా రీమేక్ చేస్తున్నాడు. మరి షారుఖ్ ఖాన్ లా అక్షయ్ కూడా కమ్ బ్యాక్ ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)