OMG 2 : సీక్వెల్ షూటింగ్ స్టార్ట్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్స్..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘ఓఎమ్‌జి 2’ ఫస్ట్ లుక్ పోస్టర్స్..

10TV Telugu News

OMG 2: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఇటీవలే ‘రక్షాబంధన్’ షూట్‌కి గుమ్మడికాయ కొట్టిన ఖిలాడి శనివారం కొత్త సినిమా OMG 2 కి కొబ్బరికాయ కొట్టారు. ఇవాళ్టినుండి ఆయన షూట్‌లో పాల్గొంటున్నారు. 2012లో వచ్చిన సెన్సేషనల్ హిట్ OMG కి సీక్వెల్‌గా OMG 2 రూపొందబోతోంది.

Global Prabhas Day : హ్యాపీ బర్త్‌డే డార్లింగ్

అమిత్ రాయ్ దర్శకత్వంలో, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, విపుల్ డి షా, రాజేష్ బల్, అశ్విన్ వర్దే కలిసి నిర్మిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
OMG 2 షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుపుతూ రిలీజ్ చేసిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో

OMG కి ఏమాత్రం తగ్గకుండా.. అంతకుమించి అనేలా ఈ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో.. రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గన్‌లతో కలిసి అక్షయ్ ఇంపార్టెంట్ రోల్ చేసిన ‘సూర్యవంశీ’ దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల కానుంది.