Akshay Kumar : ఇందులో కూడా సౌత్ హీరోలని ఫాలో అవుతున్న అక్షయ్.. ఇదొక్కటి మంచిపనే..

అక్షయ్ కుమార్ సౌత్ నుంచి సినిమాల్నే కాదు, మన స్టార్ హీరోలకున్న సక్సెస్ ఫార్ములాల్ని కూడా కాపీ కొడుతున్నారు. అక్షరాలా వంద కోట్ల రెమ్యూనరేషన్

Akshay Kumar : ఇందులో కూడా సౌత్ హీరోలని ఫాలో అవుతున్న అక్షయ్.. ఇదొక్కటి మంచిపనే..

Akshay Kumar

Akshay Kumar :   ఇటీవలే ఓ పాన్ మసాలా యాడ్ లో నటించినందుకు తన ఫ్యాన్స్, నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ సౌత్ నుంచి సినిమాల్నే కాదు, మన స్టార్ హీరోలకున్న సక్సెస్ ఫార్ములాల్ని కూడా కాపీ కొడుతున్నారు. అక్షరాలా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ కుమార్ మన స్టార్ హీరోల్ని చూసి రెమ్యూనరేషన్ సగానికి సగం తగ్గించేసుకుంటున్నారు.

100కోట్లు.. అక్షయ్ అక్షరాలా ఒక్క సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్. సినిమా హిట్ అయితే 100 కాదు అంతకుమించి ఇవ్వడానికైనా ఓకే అంటారు ప్రొడ్యూసర్లు. కానీ కాస్త అటూ ఇటైతేనే అమ్మో అంతా అనుకుంటారు. ఈమధ్య వరసగా ఫ్లాపులు ఫేస్ చెయ్యడం వల్లనో ఏమో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన రెమ్యూనరేషన్ ని 100 నుంచి దాదాపు సగానికి తగ్గించేసుకున్నారు. ఈమధ్య సౌత్ నుంచి సినిమాల్నే కాదు ఇలాంటి సరికొత్త సక్సెస్ ఫార్ములాల్ని కూడా వంటపట్టించుకుంటున్నారు అక్షయ్ కుమార్.

బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులొచ్చినా అక్షయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఏమాత్రం తేడా రాదు. అలాంటిది రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం ఏంటని తెగ ఆలోచిస్తున్నారు ఫాన్స్. ఇటీవల మన తెలుగు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకొని సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం ఈ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా 100 కోట్లని 60 కోట్లకు తగ్గించేసుకుని లాభాల్లో వాటా తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఈమధ్య అక్షయ్ కుమార్ చేసిన బచ్చన్ పాండే, పృధ్విరాజ్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కాయి. అయితే సినిమాలు మాత్రం అనుకున్నంత హిట్ కాలేదు. అందులోనూ కమర్షియల్ గా కూడా అంచనాల్ని అందుకోలేకపోయాయి. దాంతో అక్షయ్ రెమ్యూనరేషన్ తగ్గించుకుని ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నారంటోంది బాలీవుడ్ వర్గాలు.

Anirudh : తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారైనా దక్కేనా..

కెరీర్ లో సౌత్ నుంచి సినిమాల్ని రీమేక్ చేస్తూ, సౌత్ కంటెంట్ ని రెంట్ కి తీసుకుంటున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు సౌత్ హీరోల సక్సెస్ టిప్స్ కూడా ఫాలో అవుతున్నారు. ప్రొడ్యూసర్లకు లాస్ వస్తే మళ్లీ సినిమాలు చెయ్యడం ఇబ్బందే. దీంతో మన సౌత్ హీరోల్లాగా రెమ్యూనరేషన్ తగ్గించుకుని సినిమా వర్కవుట్ అయ్యి లాభాలొస్తే దాన్లో వాటా తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు అక్షయ్ కుమార్. అందుకే తను ఒక్కో సినిమాకి తీసుకునే 100కోట్ల రెమ్యూనరేషన్ ని 60 కోట్లకు తగ్గించుకుని చెయ్యబోయే సినిమాల్లో ప్రాఫిట్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు ఈ బాలీవుడ్ స్టార్.