Akshay Kumar : మరోసారి కరోనా బారిన పడ్డ స్టార్ హీరో.. మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్.. | Akshay Kumar gets corona second time

Akshay Kumar : మరోసారి కరోనా బారిన పడ్డ స్టార్ హీరో.. మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్..

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈయన గతంలో కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా తనకి కరోనా సోకిందని............

Akshay Kumar : మరోసారి కరోనా బారిన పడ్డ స్టార్ హీరో.. మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్..

Akshay Kumar :  గత రెండు సంవత్సరాల నుంచి కరోనాతో చాలా మంది ఎఫెక్ట్ అయిన సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు కరోనాతో మరణించారు. సినీ పరిశ్రమకి తీరని లోటు ఏర్పడింది కరోనాతో. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈయన గతంలో కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

Manchu Vishnu : ఆరు నెలల్లో ‘మా’ బిల్డింగ్ మొదలు పెడతాను.. మంచు విష్ణు కామెంట్స్..

ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 2022లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఈ చిత్ర టీం హాజరవ్వాల్సి ఉంది. అయితే అక్షయ్ కి కరోనా సోకడంతో ట్విట్టర్లో.. ”అంత బాగానే ఉంది అనుకున్న టైంకి మళ్ళీ నాకు కరోనా వచ్చింది. కాన్స్ 2022 వేడుకలలో పాల్గొనాలి. కానీ ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లే నా టీం అందరికి బెస్ట్ విషెష్. మిమ్మల్ని మిస్ అవుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అక్షయ్ మరోసారి కరోనా బారిన పడ్డారని తెలిసి అభిమానులు, నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

×