రియల్ హీరో : జగన్‌కు అక్షయ్ కుమార్ సహాయం

  • Published By: madhu ,Published On : January 31, 2020 / 04:20 AM IST
రియల్ హీరో : జగన్‌కు అక్షయ్ కుమార్ సహాయం

బాలీవుడ్‌లో సినిమాల్లోనే హీరోలా కాకుండా..నిజ జీవితంలో రియల్ హీరోలు అనిపించుకుంటుంటారు కొందరు. అందులో అక్షయ్ కుమార్ ఒకరు. సామాజిక కార్యక్రమాలు, ఇతరులకు ఆర్థిక సహాయం అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే..ప్రభుత్వాలకు సహాయం చేయడం వంటివి చేస్తున్నాడు ఈ హీరో. అయితే…జగన్‌కు ఎందుకు సహాయం చేశారు అనుకుంటున్నారా ? కాదు..ఏపీ సీఎం జగన్ కాదు. దర్శకుడు జగన్ శక్తి. తన దర్శకుడి చికిత్సకు కావాల్సిన ఖర్చులన్నీ భరించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. 
 

వివరాల్లోకి వెళితే…
జగన్ శక్తి డైరెక్షన్‌లో అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇది మిషన్ మంగళ్ యాన్ ప్రయోగం ఆధారంగా రూపొందింది. ఇటీవలే విడుదలై బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అక్షయ్ కుమార్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమానే జగన్ శక్తి బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 

కానీ ఇటీవలే ఓ ఫంక్షన్‌కు వెళ్లారు జగన్. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ముంబైలోని ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్నారు. వైద్యులు అతడిని పరీక్షించి టెస్టులు చేశారు. మెదడులోని రక్తం గడ్డ కట్టిందని తేల్చారు. దీంతో సరియైన శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న హీరో అక్షయ్ కుమార్..అతని వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరించడానికి ముందుకొచ్చారు.

అంతేకాదు..జగన్ కుటుంబసభ్యలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాడంట. ఆయన మంచి మనస్సుకు నిదర్శనం అంటున్నారు జగన్ శక్తి కుటుంబసభ్యులు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోందని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. 

ఇక అక్షయ్ విషయానికి వస్తే..

* గత సంవత్సరం కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూస్ వంటి డిఫరెంట్ మూవీస్‌తో అలరించాడు. 
* తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 
* ఈ చిత్రంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా నటిస్తుండడం విశేషం. 

* ఈ చిత్రంలో సారా ఆలీ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
* ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 
* వచ్చే ఏడాది 2021 ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. 
* ఈ సంవత్సరం అక్షయ్ హీరోగా నటించిన సినిమాలు సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, పృథ్వీరాజ్ సినిమాలు విడుదల కానున్నాయి. 

Read More : మూడు రోజులు బంద్ : ఈ బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి