Bollywood : అల్లు అర్జున్‌తో అక్షయ్ కుమార్ పాన్ ఇండియా సినిమా..

అన్ని ఇండస్ట్రీల్లోని నటీనటులు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చిందన్న అక్షయ్.. అల్లు అర్జున్ త్వరలో నాతో పని చేస్తాడేమో, నేను మరొక సౌత్ స్టార్‌తో నటిస్తాను...........

Bollywood : అల్లు అర్జున్‌తో అక్షయ్ కుమార్ పాన్ ఇండియా సినిమా..

Allu Arjun

Bollywood :  అల్లు అర్జున్ పై అక్షయ్ కుమార్ చేసిన కామెంట్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. పృథ్వీరాజ్ ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా అక్షయ్ కి సౌత్ దండయాత్ర గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అలాంటి ప్రశ్నలకి గట్టి కౌంటర్ ఇచ్చిన అక్షయ్ అల్లు అర్జున్ ని మాత్రం స్పెషల్ గా మెన్షన్ చేసి బన్నీ ఫ్యాన్స్ అటెక్షన్ ను గ్రాబ్ చేసాడు.

సౌత్, నార్త్ అని విడదీయకండి, దేశాన్ని విభజించే మాటల్ని ఆపేయండి అంటూ గట్టిగానే సమాధానం చెప్పాడు అక్షయ్ కుమార్. పృధ్వీరాజ్ ప్రమోషన్స్ లో భాగంగా నార్త్ పై సౌత్ ఎఫెక్ట్ లాంటి మాటలకు అక్షయ్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అయితే అన్ని ఇండస్ట్రీల్లోని నటీనటులు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చిందన్న అక్షయ్.. అల్లు అర్జున్ త్వరలో నాతో పని చేస్తాడేమో, నేను మరొక సౌత్ స్టార్‌తో నటిస్తాను ఏమో. సౌత్, నార్త్ కలవాలంటే ఇకపై అదే మార్గం అన్నారు.

Aha : బుక్ రాసిన బాలయ్య.. ఆ అమ్మాయితో డ్యాన్స్ వేసి.. మళ్ళీ అన్‌స్టాపబుల్..

సౌత్ లో ఏ హీరో పేరు చెప్పకుండా అక్షయ్.. అల్లు అర్జున్ ని మెన్షన్ చేయడంతో ఇది సార్ మీ రేంజ్ అంటూ బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. పుష్పరాజ్ చూపించిన ఇంపాక్ట్ అలాంటిది అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గతంలో పుష్ప రిలీజ్ టైమ్ లో కూడా బన్నీపై ప్రశంసల వర్షం కురిపించాడు అక్షయ్. ఇప్పుడిలా అల్లు అర్జున్ తనతో నటిస్తాడంటూ కొత్త చర్చకు దారితీసాడు. ఇప్పటికే పలుమార్లు సౌత్ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించిన అక్షయ్ ఈ సారి చేసిన వ్యాఖ్యలు మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాయి.