Akshay Kumar : ఆడియన్స్‌ని నిందించకండి.. అది మన తప్పు అంటున్న అక్షయ్ కుమార్..

త ఏడాది కాలం నుంచి బాలీవుడ్ లోని ప్రతి సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై బాలీవుడ్ లోని పలువురు స్టార్స్ స్పందిస్తూనే వచ్చారు. తాజాగా దీని పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఇన్‌డైరెక్ట్ గా స్పందించాడు. అక్షయ్ నటించిన తాజా చిత్రం సెల్ఫీ..

Akshay Kumar : ఆడియన్స్‌ని నిందించకండి.. అది మన తప్పు అంటున్న అక్షయ్ కుమార్..

Akshay Kumar

Akshay Kumar : గత ఏడాది కాలం నుంచి బాలీవుడ్ లోని ప్రతి సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీనికి సుశాంత్ సింగ్ సూసైడ్ కారణం అంటూ కొందరు, అశ్లీలత మరియు మత ధర్మాలను కించపరిచేలా సినిమాలు చిత్రీకరిస్తున్నారు అంటున్నారు మరికొందరు. ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై బాలీవుడ్ లోని పలువురు స్టార్స్ స్పందిస్తూనే వచ్చారు. తాజాగా దీని పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఇన్‌డైరెక్ట్ గా స్పందించాడు. అక్షయ్ నటించిన తాజా చిత్రం సెల్ఫీ. మలయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకి ఇది రీమేక్.

Selfiee Collections : బాలీవుడ్ లో మరో డిజాస్టర్.. సెల్ఫీ సినిమాకు అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్

కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్‌ని విలేకరి.. మీ గత నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి, దీని పై మీ స్పందన ఏంటని అడిగాడు. అక్షయ్ బదులిస్తూ.. ”ఇదేమి నాకు మొదటిసారి కాదు. నా కెరీర్ లో ఒక సమయంలో వరుసగా 16 ప్లాప్ లు చూశాను, మరోసారి 8 ప్లాప్ లు చూశాను. అప్పుడైనా, ఇప్పుడైనా ఆ సినిమాల రిజల్ట్ కి కారణం నేనే. ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తుంది. వారికీ నచ్చినట్లు సినిమాలు తీయడం మా పని. అలా కాకుండా ఏది పడితే అది తీసి వాళ్ళ ముందుకు తీసుకు వెళ్లి.. ప్రేక్షకులు సినిమా చూడడం లేదని వాళ్ళని తిరిగి నిందించడం తప్పు. నా సినిమాలు ప్లాప్ అయ్యాయి అంటే దానికి 100 శాతం బాధ్యత నాదే” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ వీకెండ్ (ఫిబ్రవరి 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెల్ఫీ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు కేవలం 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. టైర్ 2 హీరోలకు కూడా ఓపెనింగ్స్ ఇంతకంటే బాగా వస్తున్న సమయంలో అక్షయ్ సినిమాకు ఇలా కలెక్షన్స్ రావడంతో బాలీవుడ్ ఆశ్చర్యపోయింది.