స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌కి కరోనా పాజిటివ్

స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌కి కరోనా పాజిటివ్

Akshay Kumar Tests Positive For Covid 19

కరోనా సెకెండ్ వేవ్‌లో కూడా అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటీనటులు ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌, మాధవన్‌, అమీర్ ఖాన్‌, పరేష్‌ రావల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మనోజ్‌ వాజ్‌పేయీలు కొవిడ్‌-19 బారిన పడగా.. లేటెస్ట్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ కూడా కరోనా బారిన పడ్డారు.

ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లుగా వెల్లడించిన అక్షయ్.. ‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధలోకి వెళ్లినట్లు వెల్లడించారు.

వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లుగా చెప్పిన అక్షయ్ కుమార్.. నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానంటూ అక్షయ్ చెప్పారు. దేశంలో మహారాష్ట్రాలో కరోనా పరిస్థితి దారుణంగా మారిపోతూ ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి.