Akshay Kumar : ఈ స్పీడేంటి బాబు.. ‘ఖిలాడి’ పది సినిమాలు లైన్‌లో పెట్టాడుగా..!

అక్షయ్ కుమార్.. ఏ సినిమా చేసినా కాసుల వర్షమే.. ఆ క్రేజ్‌ని క్యాష్ చేస్కోడానికి వరసగా సినిమాలు చేస్తున్నారు..

10TV Telugu News

Akshay Kumar: సంవత్సరానికి ఒక్క సినిమా చెయ్యడానికే ఆపసోపాలు పడుతున్న బాలీవుడ్ హీరోలున్న ఈ జెనరేషన్‌లో సంవత్సరానికి మినిమమ్ 3 సినిమాలు ఈజీగా చేసేస్తారు ఈ యాక్షన్ హీరో. బాలీవుడ్‌లో ఏ హీరోకూ లేనన్ని సినిమాల్ని లైన్లో పెట్టి రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..

అక్షయ్ కుమార్.. ఏ సినిమా చేసినా కాసుల వర్షమే.. ఆ క్రేజ్‌ని క్యాష్ చేస్కోడానికి వరసగా సినిమాలు చేస్తున్నారు.. ఒకప్పుడు మొనాటనస్ సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు వెరైటీకే ఓటేస్తున్నారు. సంవత్సరానికి మినిమమ్ 3 సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ ఈసారి మొత్తం 10 సినిమాల పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ రెట్రో కాన్సెప్ట్ మూవీలో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు అక్షయ్.

Bell Bottom

 

అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘బెల్ బాటమ్’ సినిమాను జూలై 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు అక్షయ్ కుమార్. ఈ సినిమాతో పాటు లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ కావల్సిన ‘సూర్యవన్షీ’ కూడా పెండింగ్‌‌లోనే ఉంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ‘సూర్యవన్షీ’ రాబోతోంది. ఈ సినిమాలతో పాటు ‘రామ్ సేతు’, ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’ సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు అక్షయ్. అంతేకాదు లేటెస్ట్‌గా సూర్య హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని బాలీవుడ్‌లో అక్షయ్ చేత రీమేక్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు సూర్య అండ్ టీమ్.

Atrangi Re

 

మామూలుగా సంవత్సరానికి 3 సినిమాలు రిలీజ్ చేసే ఈ కలెక్షన్ కింగ్, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్ మూవీస్‌తో కలిపి 5 సినిమాల రిలీజ్ టార్గెట్‌గా పెట్టకున్నారు. ధనుష్, సారా అలీఖాన్, అక్షయ్ లీడ్ రోల్స్‌లో వస్తున్న ‘అతరంగీ రే’, ‘రక్షాబంధన్’ తో పాటు ‘ఓ మై గాడ్’ కు సీక్వెల్‌ కూడా షూటింగ్ ప్రాసెస్‌లోనే ఉన్నాయి. సినిమాలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే ‘వెబ్ ది ఎండ్’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు అక్షయ్. ఇలా బాలీవుడ్‌లో ఏ హీరోకూ లేనన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అక్షయ్.

Bachchan Pandey

 

10TV Telugu News